పెద్ద హీరోల సినిమాలతో పెద్దగా ప్రయోజనం లేదని.. వాటితో లాభాలు రావడం లేదని.. కేవలం పెద్ద సినిమా రిలీజ్ చేసామనే పేరు కోసమే బయ్యర్లు రిస్క్ చేస్తున్నారని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా సంచలన వ్యాఖ్యలు చేసారు. వంద రూపాయల టికెట్‌లో అన్నీ పోను మిగిలే షేర్ నలభై రూపాయలు మాత్రమేనని, కానీ కేవలం టాక్స్ మాత్రం తీసేసి దానినే షేర్‌గా చెప్పుకుంటున్నారని, వాస్తవానికీ, వచ్చే దానికీ చాలా తేడా ఉందని, అది డిస్ట్రిబ్యూటర్ కి మాత్రమే తెలుసని ఆయన అంటున్నారు. అంతేకాదు... స్టార్ హీరోల సినిమాల కంటే నాని - శర్వానంద్ - నిఖిల్ లాంటి హీరోలే ఇప్పుడు ఇండస్ట్రీని నడిపిస్తున్నారని ఆయన తేల్చేశారు. వాళ్ల సినిమాల మీదే ఎవరికైనా డబ్బులు మిగులుతున్నాయి కానీ పెద్ద సినిమాల వల్ల కాదని అన్నారు.
నైజాంలో గతంలో నలభై మంది డిస్ట్రిబ్యూటర్లు వుండేవారని, ఇప్పుడు తనతో పాటు సునీల్ - దిల్ రాజు మాత్రం మిగిలామని - ఇదే పద్ధతి కొనసాగుతూ పోతే డిస్ట్రిబ్యూటర్లు కనుమరుగు అయిపోతారని అభిషేక్ అభిప్రాయపడ్డారు. పంపిణీదారునిగా కెరియర్ మొదలు పెట్టిన అభిషేక్ నిర్మాతగా మారి కేశవ - బాబు బాగా బిజీ చిత్రాలను తీస్తున్నారు.
కాగా ఇటీవల దిల్ రాజు కూడా సెలక్టివ్‌గా సినిమాలు రిలీజ్ చేయడం చూస్తోంటే పంపిణీదారులు చెబుతున్నది నిజమే అనిపిస్తోంది. మరి పంపిణీదారులు నష్టపోతే సినీ ఇండస్ర్టీకే ప్రమాదం కాబట్టి దీనికి పరిష్కారం కూడా చూడాలి. పెద్ద సినిమాల బడ్జెట్ తగ్గించుకోవడమో.. ఇంకొకటో ఇంకొకటో ఆలోచన చేసి సినీ ఇండస్ర్టీని నిలబెట్టుకోవాలి కదా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/