నటుడు సంపూర్ణేశ్ బాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే.. ఆయనకు ఎలాంటి గాయాలూ కాకపోవడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ శివారులో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
సంపూర్ణేశ్ బాబు హీరోగా వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో 'బజార్ రౌడీ' అనే సినిమా తెరకెక్కుతోంది. సందిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులో జరుగుతున్నట్టు సమాచారం. అయితే.. చిత్రీకరణలో భాగంగా సంపూర్ణేశ్ బైక్‌ను పైకి లేపి సంచుల మధ్య నుంచి కిందకు దూకాల్సి ఉంది.
అయితే.. ఆ సీన్ షూట్ చేస్తుండగా.. బైక్ అదుపు తప్పింది. తాడుతో బైక్‌ను కిందకు దింపే సమయంలో సరిగా ల్యాండ్ కాకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌తో పాటు సంపూర్ణేష్ కూడా కింద పడిపోయాడు. లేవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సంపూర్ణేశ్ బాబును పైకి లేపారు. దీంతో ప్రమాదం తప్పింది.
హృదయ కాలేయంతో సంపూర్ణేశ్ బాబు 'బర్నింగ్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సింగం 123, కొబ్బరిమట్ట, కరెంట్ తీగ, బందిపోటు, జ్యోతిలక్ష్మి తదితర సినిమాల్లో నటించాడు సంపూ. తెలుగు బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.