'మిర్చి' లా 'ఆచార్య' సెంటిమెంట్ బ్రేక్ చేసేనా?

Update: 2021-11-29 01:39 GMT
మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చిత్రీకరణ ముగిసి చాలా నెలలు అవుతోంది. విడుదలకు సరైన స్పేస్ లేకపోవడంతో ఎవరికి ఇబ్బంది లేకుండా.. తాను ఇబ్బంది పడకుండా ఫిబ్రవరిలో విడుదలకు సిద్దం అయ్యాడు. ఆచార్య సినిమా పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్‌ చరణ్ కీలక పాత్రలో నటించాడు.. ఒక మాటలు చెప్పాలంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడంటూ వార్తలు వస్తున్నాయి.

చరణ్ పోషిస్తున్న సిద్దా పాత్ర సినిమాలో అత్యంత కీలకంగా ఉంటుంది. కనుక ఇది మెగా మల్టీ స్టారర్‌ అంటూ అభిమానులు చాలా నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు. తాజాగా సిద్దా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా స్థాయిని మరింతగా పెరిగింది. ఎప్పుడెప్పుడు ఫిబ్రవరి వస్తుందా అంటూ ఎదురు చూసేలా చేసింది అనడంలో సందేహం లేదు.

చిరంజీవి సినిమా అంటేనే సాదారణంగా అంచనాలు భారీగా ఉండి.. రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవుతూ ఉంటాయి. అలాంటిది చరణ్ కూడా నటించాడు.. అపజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వం వహించాడు కనుక సినిమా వందల కోట్లు సునాయాసంగా రాబడుతుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. సినిమా ఎంత బాగున్నా కూడా కరెక్ట్‌ సమయంలో విడుదల చేస్తేనే వసూళ్లు నమోదు అవుతాయి.

సరైన సమయంలో విడుదల కాకపోవడం వల్ల ఎన్నో సినిమాలు వసూళ్లు భారీగా దక్కించుకోలేక పోయిన విషయం మనం చూశాం. సాదారణంగా అయితే టాలీవుడ్ కు ఫిబ్రవరి మరియు మార్చి నెలలు కాస్త డ్రై సీజన్‌ అంటారు. ఆ రెండు నెలలు కూడా పరీక్షల సీజన్ కావడం వల్ల ఫ్యామిలీ మరియు స్టూడెంట్స్ సినిమాలకు ఎక్కువగా హాజరు అవ్వరు.

అందుకే ఆ రెండు నెలలను స్కిప్‌ చేసి ఏప్రిల్‌ నుండి వరుసగా సమ్మర్ కానుకగా అంటూ సినిమాలను విడుదల చేస్తారు. కాని ఆచార్య ను మాత్రం ఏదో నమ్మకంతో ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.

గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఉప్పెన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయంటూ ట్రేడ్‌ వర్గాల టాక్‌.

గత ఏడాది పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కరోనా వల్ల విద్యాసంస్థలు అన్ని మూసి ఉండటంతో పాటు పరీక్షలు కూడా నిర్వహించలేదు. అందుకే గత ఏడాది ఫిబ్రవరిని పరిగణలోకి తీసుకోనక్కర్లేదు అనే టాక్ ఉంది. కొన్నేళ్ల క్రితం ఫిబ్రవరిలో వచ్చిన ప్రభాస్ మిర్చి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమా భారీగా వసూళ్లు దక్కించుకుని ఫిబ్రవరి సెంటిమెంట్‌ ను బ్రేక్ చేసింది. మరి మిర్చి సినిమా మాదిరిగా ఆచార్య కూడా ఫిబ్రవరి సెంటిమెంట్‌ ను బ్రేక్‌ చేసి ముందు ముందు టాలీవుడ్‌ సినిమాలు ఫిబ్రవరిలో వచ్చేలా ఆచార్య ఆదర్శంగా నిలుస్తుందా అనేది చూడాలి.
Tags:    

Similar News