పిక్‌టాక్ : బ్లాక్ అండ్ వైట్‌లోనూ సీరత్ కలర్ ఫుల్ అందాలు
సీరత్ కపూర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్‌లో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
పదేళ్ల క్రితం శర్వానంద్‌కి జోడీగా 'రన్ రాజా రన్' సినిమాలో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సీరత్ కపూర్. ఈ అమ్మడు బాలీవుడ్‌లో మొదటి సినిమా చేసినప్పటికీ అక్కడ గుర్తింపు దక్కించుకోలేక పోయింది. కపూర్ ఫ్యామిలీ కిడ్ అనే ట్యాగ్ ఉన్నప్పటికీ పెద్దగా ఆఫర్లు దక్కలేదు. కానీ టాలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చాయి. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు వెంట వెంటనే ఆఫర్లు సొంతం చేసుకుంది. కానీ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు మాత్రం దక్కలేదు. దాంతో మెల్ల మెల్లగా ఆఫర్లు తగ్గాయి.
గత సంవత్సరం మూడు తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీరత్ కపూర్‌కి మరోసారి నిరాశే మిగిలింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కొత్త సినిమాలు మొదలు కానప్పటికీ ఒకటి రెండు సినిమాలతో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌లో ఈ అమ్మడి పోరాటం కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇతర భాషల్లోనూ ఈమె సినిమాల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది.
సీరత్ కపూర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్‌లో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. క్లీ వేజ్ షో తో డిజైనర్ హారంను మెడలో ధరించిన సీరత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో సీరత్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈసారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసి కలర్ ఫుల్‌గా అందాలను కళ్ల ముందు ఆవిష్కరించింది అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడి అందం కు తగ్గట్లుగా ఆఫర్లు దక్కడం లేదని, గుర్తింపు రావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంబయిలోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిని సీరత్ కపూర్ మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీని పూర్తి చేసింది. నటనలోనూ శిక్షణ తీసుకున్న ఈ అమ్మడు కొన్నాళ్ల పాటు రాక్ స్టార్ సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా లేదా ప్రొడక్షన్ టీంలో వర్క్ చేసింది. చివరకు ఈ అమ్మడు హీరోయిన్‌గా 2014లో ఎంట్రీ ఇచ్చింది. నటిగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇన్‌స్టాలో మిలియన్ ఫాలోవర్స్‌ని కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది.