మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. చివరి దశ చిత్రీకరణ జరుపుతున్న చిత్ర యూనిట్ సభ్యులు మరో వైపు సినిమాను దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా అమ్మేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల నుండే నైజాం ఏరియాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ శ్రీను రూ.42 కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఆంధ్రా మరియు సీడెడ్ రైట్స్ విషయమై కూడా తాజాగా డీల్ క్లోజ్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు ఏరియాలకు కలిపి రూ.62 కోట్లకు అటు ఇటుగా బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఆచార్య కు కొరటాల శివ దర్శకుడు అవ్వడం వల్ల ఓవర్సీస్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన గత చిత్రాలు ఓవర్సీస్ లో రాబట్టిన కలెక్షన్స్ నేపథ్యంలో ఆచార్యను అక్కడ భారీ మొత్తంకు కొనుగోలు చేయబోతున్నారు.
చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఓవర్సీస్ లో భారీ ఎత్తున వసూళ్లు సాధించాడు. ఖైదీ నెం.150 మరియు సైరా సినిమాలు అక్కడ మంచి వసూళ్లను దక్కించుకున్న నేపథ్యంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఓవర్సీస్ రైట్స్ ను దాదాపుగా రూ.20 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నాడట. చిరు.. చరణ్ నటించడంతో పాటు కొరటాల శివ దర్శకత్వం వహించడం వల్ల సినిమా రేంజ్ అమాంతం పెరిగి పోయింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ ను చేసినట్లుగా సమాచారం అందుతోంది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా భారీ మొత్తంలో బిజినెస్ అయ్యిందట. నైజాం.. ఓవర్సీస్.. ఆంద్రా.. సీడెడ్ ఇతర రాష్ట్రాల్లో కలిపి 140 కోట్లకు పైగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అటు ఇటుగా రూ.150 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మెగాస్టార్ ముందు చాలా పెద్ద లక్ష్యమే ఉంది. కాని సినిమా కు పాజిటివ్ టాక్ వస్తే ఈ లక్ష్యం పెద్దదేమీ కాదంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవలే మొదటి పాట వచ్చింది. ఆ పాటకు మంచి ఆధరణ లభించింది. దాంతో సినిమా పై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. చిరంజీవి మరియు చరణ్ ల కాంబోలో ఉండే సీన్స్ కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేమికుడు కూడా ఎదురు చూస్తున్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టి మరో పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.