మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా నరసింహారెడ్డి` 2019లో విడుదలైంది. ఆ తర్వాత మూడేళ్లయినా ఇప్పటివరకూ చిరు నుంచి వేరొక రిలీజ్ లేదు. అందుకే మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా `ఆచార్య` కోసం వేచి చూస్తున్నారు. చిరు-చరణ్-కొరటాల కాంబినేషన్ లోని ఈ మూవీ పూర్తి మాస్ యాక్షన్ మెసేజ్ తో రక్తి కట్టించనుందని టాక్ నడుస్తోంది.
ఇప్పటికే `ఆచార్య` నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయిందని దాదాపు 200 కోట్ల మేర బిజినెస్ చేస్తోందని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పటివరకూ ఆచార్య థియేట్రికల్ బిజినెస్ కి సంబంధించి సరైన క్లారిటీ లేదు.
తాజా సమాచారం మేరకు.. ఆచార్య థియేట్రికల్ బిజినెస్ ని మార్చి నుంచి ప్రారంభిస్తారని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. అప్పటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఇటీవల చిరుకి కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. స్వల్పలక్షణాలు బయటపడగా చికిత్స కొనసాగుతోంది. తదుపరి ఆయన వరుస చిత్రాల్లో నటించాల్సి ఉంది. మరోవైపు ఆచార్య సినిమాని ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ చేస్తారన్న గుసగుస కూడా వినిపిస్తోంది. అయితే రిలీజ్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మార్చిలో బిజినెస్ డీల్స్ ముగించి తదుపరి రిలీజ్ తేదీని కూడా ప్రకటించే వీలుంటుందని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్.. పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. దేవాదాయ శాఖ అవినీతి నేపథ్యంలో సోషియో ఫాంటసీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆచార్య రక్తి కట్టిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరు- చరణ్ నక్సల్స్ గెటప్స్ లో కనిపించడం ఆసక్తిని పెంచింది. ఆచార్యపై భారీ అంచనాలు నెలకొన్నాయి.