ఆచార్య' టెంపుల్‌ సిటీ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Update: 2021-04-23 16:30 GMT
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు అపజయం అనేది తెలియని కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. చిరంజీవితో పాటు రామ్ చరణ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా ప్రస్థావన వచ్చిన ప్రతి సారి కూడా ఈ సినిమా కోసం వేసిన భారీ టెంపుల్‌ సిటీ సెట్టింగ్ గురించిన ప్రస్థావన వస్తూనే ఉంది. టెంపుల్‌ సిటీని 20 ఎకరాల్లో కనివిని ఎరుగని రీతిలో అద్బుతంగా రూ.20 కోట్లతో రూపొందించడం జరిగింది. ఒక్క సెట్టింగ్‌ కోసం అంత ఖర్చు ఏంటీ అంటూ కొందరు పెదవి విరిచే వారు కూడా ఉన్నారు. కాని ఆ టెంపుల్‌ సిటీ ప్రత్యేకత సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతుంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్న దాని ప్రకారం ఆచార్య సినిమా లో సగంకు పైగా టెంపుల్‌ సిటీలోనే జరుగుతుందని అంటున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు యాక్షన్‌ సన్నివేశాలు కూడా అందులోనే ఉంటాయని అంటున్నారు. కథలోని కీలక సన్నివేశాలు అన్ని కూడా టెంపుల్‌ సిటీలో ఉండటం వల్లే అంత భారీ మొత్తంను ఖర్చు చేసి ఆ సెట్టింగ్ ను వేయించినట్లుగా చెబుతున్నారు. సినిమా బడ్జెట్‌ లో మెజార్టీ భాగం టెంపుల్‌ సిటీ కోసం ఖర్చు చేశారు అంటే సినిమా లో ఆ సెట్టింగ్‌ ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

నక్సల్స్‌ బ్యాక్ గ్రౌండ్‌ తో పాటు దేవాలయాల పరిరక్షణ వంటి ఒక సోషల్‌ మెసేజ్ తో రూపొందుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ప్రారంభం అయిన వెంటనే కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలు అవ్వడం.. నటుడు సోనూసూద్‌ ఇంకా కొందరికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడం తో షూటింగ్‌ ను నిలిపి వేయడం జరిగింది. సినిమాను మే 13న విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేయబోతున్నారు. కొత్త విడుదల తేదీని కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గిన తర్వాత ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News