ఆ కేసులో తమన్నా.. కాజల్ ను విచారణకు ఆ పోలీసుల నిర్ణయం!

ప్రముఖ సినీ నటీమణులు తమన్నా.. కాజల్ కు కొత్త కేసు కష్టం ఎదురైనట్లుగా చెప్పాలి.;

Update: 2025-02-28 04:34 GMT

ప్రముఖ సినీ నటీమణులు తమన్నా.. కాజల్ కు కొత్త కేసు కష్టం ఎదురైనట్లుగా చెప్పాలి. గతంలో వారు పాల్గొన్న కార్యక్రమాలు ఇప్పుడు కేసు ఉచ్చు వారికి బిగుసుకునేలా చేయటమే కాదు.. పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు అగ్ర నటీమణులను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. తమ వద్ద జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని కోరనున్నారు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందొచ్చన్న ఆశ చూపి.. పుదుచ్చేరికి చెందిన పది మంది నుంచి సుమారు రూ.2.4 కోట్ల మొత్తాన్ని వసూలు చేశారని.. తమను మోసం చేసినట్లుగా అశోకన్ అనే రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు హెడ్డాఫీసుగా స్టార్ట్ అయ్యింది.

ఈ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటి తమన్నా .. ఇతర ప్రముఖులు హాజరయ్యారు.అంతేకాదు.. ఈ కంపెనీకి చెందిన మరో కార్యక్రమం మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్లో జరిగింది. దీనికి కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. అనంతరం ముంబయిలో ఒక పార్టీని నిర్వహించారు. వేలాది మంది నుంచి డబ్బుల్ని సేకరించారు.

ఈ వ్యవహారాలకు సంబంధించి 36 ఏళ్ల నితీష్ జెయిన్.. 40 ఏళ్ల అరవింద్ కుమార్ లను ఇప్పటికే పుదుచ్చేరి పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా..కాజల్ అగర్వాల్ ను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. వారికి దీనికి సంబంధించిన సమాచారాన్ని అందజేయనున్నారు.

Tags:    

Similar News