కోకాపేట షెడ్యూల్ తో 'ఆచార్య'కు గుమ్మడికాయ

Update: 2021-05-28 08:30 GMT
చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉండగా కరోనా సెకండ్‌ వేవ్‌ తో నిలిచి పోయిన విషయం తెల్సిందే. చరణ్ మరియు సోనూ సూద్‌ లపై షూటింగ్ చేస్తూ ఉండగా సోనూ సూద్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయ్యింది. అలా నిలిపి వేసిన షూటింగ్ లాక్ డౌన్ కారణంగా మరి కొన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. షూటింగ్ లకు వచ్చే నెల నుండి తిరిగి అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోకాపేట లో తుది షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేశారు. జులై లో 20 రోజుల షెడ్యూల్‌ తో ఆచార్య కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయట.

తుది షెడ్యూల్‌ లో చిరంజీవి.. చరణ్‌ మరియు సోనూసూద్‌ తో పాటు కీలక నటీనటులు పాల్గొనబోతున్నారు. ఈ నెలలో సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా సెకండ్‌ వేవ్‌ తో మొత్తం ప్లాన్‌ తలకిందులు అయ్యింది. జులైలో సినిమాను ముగించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో పరిస్థితులు అనుకూలించినా కూడా విడుదలకు సిద్దం కాదు. కనుక సినిమా ను దసరా వరకు విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

చిరు.. చరణ్‌ లు కలిసి నటిస్తున్న సినిమా అవ్వడంతో అభిమానులతో పాటు అన్ని వర్గాల వారిలో కూడా ఆసక్తి నెలకొంది. పెద్ద ఎత్తున ఈ సినిమా ను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. అపజయం ఎరుగని కొరటాల శివ ఖచ్చితంగా ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్‌ సక్సెస్ ను ఇవ్వబోతున్నాడు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. చిరంజీవి ఆచార్య ముగిస్తే మరో మూడు సినిమాలు లైన్ గా వేచి ఉన్నాయి. ఆచార్య షూటింగ్ పూర్తి చేసి విడుదల వరకు ఆగకుండా లూసీఫర్‌ ను చిరంజీవి మొదలు పెట్టే అవకాశం ఉంది. అలాగే కొరటాల కూడా ఎన్టీఆర్‌ తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు.
Tags:    

Similar News