హైదరాబాద్ సహా చుట్టుపక్కల అకాల వర్షం సినీషూటింగులకు తీవ్ర ఇబ్బంది కలిగించిన సంగతి తెలిసిందే. ఔట్ డోర్ షూటింగులకు చాలా ఇరకాటమే ఏర్పడింది. డజను పైగా సినిమాలకు సంబంధించిన షూటింగులు నిలిచిపోయాయి.
ముఖ్యంగా ఆచార్య టీమ్ కి ఊహించని కష్టం వచ్చి పడిందని తెలుస్తోంది. ఆచార్యకు ఈసారి కూడా సెట్ కష్టాలు తప్పలేదు.ఇప్పటికే ఆచార్య సెట్ ని రెండు సార్లు వేశారు. దాదాపు 3 కోట్లు ఖర్చు అయిందని ఈ సెట్స్ వేయడానికి. అయితే నిన్న కురిసిన అకాల వర్షాలకు ఈ సెట్స్ దాదాపుగా పడిపోయే స్థితికి వచ్చేశాయని అంటున్నారు.
ఈ పరిణామం ఊహించనిది. అల్రేడీ ఓవర్ బడ్జెట్ అవుతుందని మదన పడుతున్న రామ్ చరణ్ కి ఇదో కొత్త ఇబ్బంది ఎదురైందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఆచార్య భారీ మల్టీస్టారర్. పైగా కొరటాల శివ ఎక్కడా రాజీకి రాకుండా సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీనిని రూపొందిస్తుండగా... చిరు- చరణ్ జోడీ నటిస్తుండడం మెగాభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.