మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న 'ఆచార్య' సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో పాటు రామ్ చరణ్ కీలక పాత్రలో నటించడం వల్ల కూడా సినిమా రేంజ్ అమాంతం పెరిగి పోయింది. తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు ఈ సినిమా ను అన్ని భాషల ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మద్య కాలంలో వరుసగా తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యి భారీ వసూళ్లను నమోదు చేస్తున్నాయి. కనుక ఆచార్య కూడా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల భారీగా వసూళ్లను రాబట్టడం ఖాయం అని మెగా అభిమానులు భావిస్తున్నారు. కాని ఆచార్యకు ఇద్దరు సూపర్ స్టార్ ల రూపంలో పాన్ ఇండియా రేంజ్ లో అడ్డు తగిలే అవకాశం కనిపిస్తుంది.
ఆచార్య సినిమా ను ఉత్తరాదిన భారీ ఎత్తున విడుదల చేయాలంటే సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమా అడ్డుగా నిలుస్తుంది. రాధే సినిమా ను ఆచార్య విడుదల కాబోతున్న మే 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. సల్మాన్ వంటి సూపర్ స్టార్ మూవీతో ఉత్తరాదిన ఆచార్య పోటీ పడటం అంటే కాస్త కష్టమే. రాధే సినిమా ఫలితం బెడిసి కొడితే తప్ప ఆచార్యను అక్కడి వారు పట్టించుకునే అవకాశం లేదు.
ఇక చిరంజీవికి మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళంలో కూడా ఆచార్య విడుదల సమయంలోనే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మరక్కర్ అనే ఛారిత్రాత్మక సినిమా రాబోతుంది. మరక్కర్ వల్ల కేరళలో ఆచార్య సినిమాను జనాలు పట్టించుకుంటారా లేదా అనేది అనుమానంగా ఉంది. మొత్తంగా హిందీ మరియు మలయాళ ప్రేక్షకుల్లోకి ఆచార్యను తీసుకు వెళ్లాలి అంటే చాలా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంది.