చిరంజీవి.. కొరటాల కాంబోలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కొరటాల గత సినిమాల్లో ఏ ఒక్కటి కూడా నిరాశ పర్చలేదు. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ సినిమాపై ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. తాజాగా ఒక భారీ సెట్టింగ్ ను రూ.20 కోట్లతో నిర్మించబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రూ.20 కోట్లతో సెట్ట్ ఏంటో అంటూ అంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కాని మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే కేరళ కు చెందిన ప్రముఖ ఆలయాలు మరియు వీధులను హైదరాబాద్ లో నిర్మించబోతున్నారు. అందుకే అంత భారీ గా ఖర్చు అవుతుందని అంటున్నారు.
కేరళ ఆలయాలు అంటే అత్యంత విభిన్నంగా ఉంటాయి. వాటిని రీ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఆ సినిమాలో చిత్రీకరించే ఉద్దేశ్యంతోనే అంత ఖర్చు పెట్టి మరీ సెట్టింగ్ వేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఆచార్య సినిమాను అంతకంతకు పెంచుతున్నారు. వచ్చే ఏప్రిల్ లేదా మే లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.