యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరహాలో డైరెక్టర్స్ అసోసియేషన్ లోనూ సపరేట్ గిల్డ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. దర్శకసంఘంలో యాక్టివ్ గా ఉన్న క్రియేటివ్ డైరెక్టర్స్ కొందరు ఒకే గొడుగుకిందికి చేరి టాలీవుడ్ కంటెంట్ ని ఎన్ రిచ్ చేయబోతున్నారన్నది తాజా సమాచారం. ఈ గిల్డ్ సభ్యులందరినీ ఒకేతాటి పైకి తీసుకు వచ్చేందుకు ఎస్.ఎస్.రాజమౌళి సారధ్యం వహిస్తుండగా మరో నలుగురు సీనియర్ డైరెక్టర్లు బాధ్యతల్ని షేర్ చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే దర్శకసంఘం ఉనికిలోనే ఉన్నా.. యాక్టివ్ డైరెక్టర్స్ గిల్డ్ దేనికి? అని ప్రశ్నిస్తే దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అసలు టాలీవుడ్ లో కథలు ఎలా ఉండాలి? సినిమాల క్వాలిటీ ఎలా ఉండాలి? పాన్ ఇండియా లెవల్ కి కంటెంట్ ని ఎలా చేర్చాలి? దర్శకులు సమస్యల్ని పరిష్కరించడమెలా? నిర్మాతలతో దర్శకులు ఎలా మాట్లాడాలి? కొత్త రైటర్స్ ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి? అసిస్టెంట్ డైరెక్టర్ల సమస్యల్ని.. రచయితల సమస్యల్ని పరిష్కరించడమెలా? ఇలా రకరకాల విషయాలపై లీడ్ తీసుకునేందుకు యాక్టివ్ డైరెక్టర్స్ గిల్డ్ ని ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు సమస్యలపై రెండు మూడు సార్లు సమావేశాలు జరిగాయని వెల్లడైంది.
యాక్టివ్ డైరెక్టర్స్ గిల్డ్ లో తొలి 21 మంది సభ్యుల వివరాలు తుపాకీకి ఎక్స్ క్లూజివ్ గా లభించాయి. ఆ వివరాల్ని పరిశీలిస్తే..
ఎస్.ఎస్.రాజమౌళి
వీవీ వినాయక్
త్రివిక్రమ్ శ్రీనివాస్
కొరటాల శివ
సుకుమార్
శేఖర్ కమ్ముల
బోయపాటి శ్రీను
క్రిష్
హరీష్ శంకర్
వంశీ పైడిపల్లి
చంద్రశేఖర్ ఏలేటి
మారుతి
అనీల్ రావిపూడి
చందు మొండేటి
సందీప్ రెడ్డి వంగా
ఇంద్రగంటి మోహన్ కృష్ణ
నాగ్ అశ్విన్
నందిని రెడ్డి
శివా నిర్వాణ
వేణు శ్రీరామ్
తరుణ్ భాస్కర్
..జాబితాలో ఉన్నారు.
సీనియర్లు అయిన తొలి ఐదుగురు యాక్టివ్ దర్శకులు 21 మందితో కూడిన సంఘంలో ఎవరెవరు ఉండాలి? అన్నది చర్చించారని తెలుస్తోంది. మిగిలిన 16 మంది దర్శకులను ఎంపిక చేసినది వీళ్లే. యాక్టివ్ గిల్డ్ సభ్యులంతా ఏర్పాటు చేసిన సమావేశంలో రకరకాల సమస్యలపై చర్చించారు. ఈ మీటింగులో ఒక్కొక్కరూ ఒక్కో పాయింట్ చెప్పి సమస్యను ఎలా పరిష్కరించాలి? అన్నది ఆలోచించారు. పరిశ్రమకు వచ్చే కొత్త దర్శకులు.. అసిస్టెంట్ డైరెక్టర్లపై వీరంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. రచయితలతో తలెత్తే సమస్యలపైనా చర్చిస్తారు. వారి సామర్థ్యానికి సంబంధించిన విషయాల్ని సమీకరిస్తారు. అలాగే అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి ఒక సపరేట్ గ్రూప్ ని ప్రారంభించాలని నిర్ణయించారని తెలుస్తోంది.