మీటూ ఉద్యమం పక్కదారి పడుతోందా? ఈ ఉద్యమంలో ఆరోపణలన్నీ నమ్మశక్యంగా లేవా? అంటే అవుననే యాక్షన్ కింగ్ అర్జున్ ఆవేదన తెలియజేస్తోంది. మీటూ- నిందారోపణల్లో అసత్య ఆరోపణలే ఎక్కువ ఉన్నాయన్న సంకేతాలు జనంలోకి వెళుతున్నాయని - ఉద్యమం బలహీన పడిందని ఆయన వ్యాఖ్యానించారు. నాణేనికి బొమ్మ - బొరుసు ఉన్న చందంగా అవసరానికి అప్పుడలా - అవసరం తీరాక ఇప్పుడిలా అన్న చందంగా కొందరు కథానాయికలు దొంగాటకం ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. లైంగిక ఆరోపణల పేరుతో హీరోల్ని వేధించే పనిలో పడ్డారన్న విమర్శల నడుమ `మేల్ మీటూ ఉద్యమం` మొదలైంది.
నిన్నటికి నిన్న యాక్షన్ కింగ్ అర్జున్ పై నటి శృతి హరిహరణ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ తనని వేధించారని .. అప్పుడు చెప్పలేకపోయినా.. ఇప్పుడు కుదిరిందని శృతి అనడంతో యాక్షన్ కింగ్ అభిమానులు దానికి తీవ్రంగా ఖండించారు. ఫ్రీ- పబ్లిసిటీ కోసమే ఇలా రోడ్డుకీడుస్తోందన్న వాదనా వినిపించారు. ఒక జెంటిల్ మేన్ పైనే ఇలాంటి ఆరోపణలు చేస్తావా? అంటూ సామాజిక మాద్యమాల వేదికగా శృతిని ట్రోల్ చేశారు.
తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో అర్జున్ తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని - తాను ఎన్నడూ హీరోయిన్లను వేధించలేదని చెప్పారు. ఈ తరహా ఆరోపణలతో `మీటూ`ఉద్యమం బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. ఉన్నవీ - లేనివీ కల్పించి చెప్పడం ద్వారా ఇంకేదో కుట్ర జరుగుతోందని - దానిని ఎదుర్కొని పోరాడతానని ఆయన ఓ తమిళ పత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శృతి హరిహరన్ తో తాను ఒకే ఒక్క సినిమాలో నటించానని చెప్పిన ఆయన - షూటింగ్ సమయంలో ఒక్కసారి కూడా ఒంటరిగా కలుసుకున్నదే లేదని తెలిపారు.