కరోనాతో నటుడు మృతి

Update: 2020-03-27 23:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్‌ దాటికి జనాలు పిట్టలు రాలిపోయినట్లుగా చనిపోతున్నారు. వంద నుండి ఈ సంఖ్య వేలకు చేరింది. ఈ సంఖ్య మరెంతగా పెరుగుతుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిచ్చిన అమెరికా ప్రస్తుతం కరోనా కారణంగా చిగురుటాకులా వణికి పోతుంది. అమెరికాలో ఉండే పలువురు హాలీవుడ్‌ స్టార్స్‌ కు కరోనా వైరస్‌ సోనికట్లుగా తెలుస్తోంది. కొందరు కరోనా నుండి బయట పడుతూ ఉంటే మరికొందరు మాత్రం ఇంకా కరోనా వైరస్‌ తో పోరాడుతూ ఉన్నారు.

తాజాగా హాలీవుడ్‌ నటుడు మార్క్‌ బ్లమ్‌ కరోనా వైరస్‌ సోకి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 69 ఏళ్ల మార్క్‌ హాలీవుడ్‌ లో ఎన్నో చిత్రాల్లో నటించడంతో పాటు ఈమద్య కాలంలో వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా కనిపించాడు. మార్క్‌ రెండు వారాలుగా కరోనా వైరస్‌ సోకడంతో చికిత్స పొందుతున్నాడు. వయసు మీద పడటంతో ఆయన్ను డాక్టర్లు కాపాడలేక పోయారు.

మార్క్‌ బ్లమ్‌ చనిపోయిన విషయాన్ని ఆయన భార్య జానెట్‌ జరీస్‌ నిర్థారించారు. మార్క్‌ బ్లమ్‌ మృతితో ఆయన అభిమానులు ఇంకా సన్నిహితులు దీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో వర్క్‌ చేసిన ఎంతో మంది సోషల్‌ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి సామాన్యులను సెలబ్రెటీలను అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తోంది.
Tags:    

Similar News