సీనియర్ నటుడికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Update: 2021-10-31 06:03 GMT
ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్ హయాంలో భీకర్ విలన్. కత్తి పట్టి యుద్ధం చేసినా.. ముష్టిఘాతాలు కురిపించినా విలనిజానికి మారుపేరుగా నిలిచారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కన్నీరు పెట్టించారు. కమెడియన్ గా కడుపుబ్బా నవ్వించారు. అన్ని పాత్రలు పోషించి మెప్పించిన ఈ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నాటి సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ ఆస్పత్రి పాలవడం అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతోంది.    తెలుగు దిగ్గజ నటుడు  అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో జారిపడ్డాడు. కిందపడడం వల్ల నొప్పులు కాస్త ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్ లోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తూ ఇంట్లో జారిపడ్డాడు. ఆయన్ను శనివారం రాత్రి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం కైకాల సత్యనారాయణ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సతీమణితో కలిసి సత్యనారాయణ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశాడు. 'తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడుతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి' అని చిరంజీవి ట్వీట్ కూడా చేశారు.

ఇక కైకాల సినిమాల విషయానికి వస్తే.. 2019లో విడుదలైన 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహర్షి' చిత్రాల తర్వాత కైకాల మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. తాజాగా గాయపడి వార్తల్లో నిలిచారు.
Tags:    

Similar News