``నానిగాడితో నాని.. నడుమము సతి అంజన!`` ఇదేమైనా సినిమా టైటిలా? వారసుడు నానీతో నేచురల్ నాని నటిస్తున్నాడా? అని అడగొద్దు. ఇదో అందమైన ఫ్యామిలీ ఫోటో. నిన్న సంక్రాంతి సందర్భంగా నేచురల్ స్టార్ నాని స్వయంగా ఈ సకుటుంబ చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బుల్లి నానిగాడిని గారాబం చేస్తున్న నానీని ముద్దాడుతున్న భార్య అంజనా.. ఎంతో ముద్దొచ్చేస్తోంది ఈ ఫ్రేమ్. తన భర్త నానికి ఒక తీపి ముద్దు పెడుతున్న అంజన ఫుల్ హ్యాపీ మూడ్ లో కనిపిస్తున్నారు. బబ్లి బ్యూటీ రాశి ఖన్నా .. నివేదా థామస్ ఈ ఫోటోపై హార్ట్ ఎమోటికాన్ లను షేర్ చేశారు.
నిజానికి నానీ నేచురల్ ప్రేమికుడు. అంజనాతో పెద్ద ప్రేమకథే నడిపించాడన్నది రివీలైంది ఇదిరకూ. `అయితే ఈ ప్రేమకథ ఫేస్ బుక్ లో వికసించినదో లేక ఆన్ లైన్ చాటింగు పరిచయమో అసలే కాదు. ఇది మొదటి చూపు ప్రేమ కానే కాదు. జెంటిల్మన్ నాని అంజనా సోదరుడికి మంచి స్నేహితుడు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజుల్లో నానీ అంజనను కలిశాడు. అటుపై వారు స్నేహితులు అయ్యారు. తరువాత స్నేహం ప్రేమగా వికసించింది. అనంతరం పెద్దల్ని ఒప్పించి 2012 సంవత్సరంలో నిశ్చితార్థం చేసుకుని పెళ్లాడుకున్నారు. అయితే అంతకు ముందు 5 సంవత్సరాలు డేటింగ్ చేసారు. ఫ్యామిలీ మ్యాన్ లా మారిన నానీకి గారాల నానిగాడు అలియాస్ అర్జున్ పుట్టాడు. గంటా నాని వారసుడు గంటా అర్జున్ తో కలిసి గంటా అంజనా ఇలా సంక్రాంతి నాడు ఫోటో దిగారన్నమాట.
నానీ కెరీర్ సంగతి చూస్తే...తదుపరి `శ్యామ్ సింఘరాయ్` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వం వహించిన టక్ జగదీష్ ఏప్రిల్ 16 న థియేటర్లలోకి రానుంది. టక్ జగదీష్ నాని కెరీర్ 26 వ చిత్రం. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెడ్డి - సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మారుతితోనూ నాని కథా చర్చలు సాగిస్తున్నారని సమాచారం.