'మళ్లీ రావా'ను ఇంటికి పిలిచిన కేసీఆర్

Update: 2017-12-09 05:23 GMT
పొలిటికల్ లీడర్స్ కు సినిమాలు నచ్చడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. మరీ ఎక్కువగా కాకపోయినా.. సినిమా జనాలతో రాజకీయ ప్రముఖులు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. ఇలాంటి విషయాల్లో కేటీఆర్ ను ప్రముఖంగా చెప్పుకోవాలి. అడపాదడపా కేసీఆర్ కూడా సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు.

రీసెంట్ రిలీజ్ మళ్లీ రావా మూవీపై కూడా కేసీఆర్ రియాక్ట్ అయ్యారట. కాకపోతే ఆయన నేరుగా ఈ సినిమా గురించి చెప్పలేదు కానీ.. మళ్లీ రావా ముూవీ ఫీల్ గుడ్ మూవీ అనే విషయం తెలిసిన కేసీఆర్.. ఈ సినిమాను ఓ ప్రింట్ పంపించమని చెప్పారట. నేరుగా హీరో సుమంత్ ఇంటికే ఫోన్ చేశారట తెలంగాణ సీఎం. ముఖ్యమంత్రి ఇంటి నుంచి తన సినిమా గురించి ఫోన్ రావడం.. చూడాలని కోరుకుంటున్న సంగతి చెప్పడంతో సంతోషించేశాడట ఈ అక్కినేని హీరో. కేసీఆర్ అడిగిన మేరకు.. వెంటనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నాడు సుమంత్.

ఇతర సినీ ప్రముఖుల నుంచి కూడా మళ్లీ రావా చిత్రానికి ప్రశంసలే వస్తున్నాయి. ముఖ్యంగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్ అనే టాక్ వినిపిస్తోంది. కొన్ని ఎపిసోడ్స్ సాగతీత మాదిరిగా అనిపించినా.. క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమాను ముగించిన తీరు మాత్రం అద్భుతం అంటున్నారు ప్రేక్షకులు. 
Tags:    

Similar News