షూటింగ్ చేస్తే బెదిరిస్తారా? ఇదెక్క‌డి రూల్!

Update: 2022-08-14 13:46 GMT
టాలీవుడ్ లో షూటింగ్ బంద్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అగ్ర హీరోల షూటింగ్ లు  ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. అయితే ఇత‌ర భాష‌ల హీరోల చిత్రాలు.. చిన్న సినిమాల షూటింగ్ లు కొన్ని హైద‌రాబాద్ లో  య‌ధావిధిగా కొన‌సాగుతున్నాయి. చిన్న సినిమాల‌కు సంబంధించి  దాదాపు 16 సినిమాలు చిత్రీక‌ర‌ణ ఎలాంటి ఆటంకం లేకుండా జ‌రుపుకుంటున్నాయి.

క‌మిటీల  తీర్మానం ప్ర‌కారం వాటికి ఎలాంటి అడ్డంకి లేదు. ఈ క్ర‌మంలో యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ సొంత బ్యాన‌ర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించి ఓ ఫైట్ సీన్ భారీ  సెట్ లో  చిత్రీక‌రించాల్సి  ఉంది. దాదాపు 70 ల‌క్ష‌లు  ఈ సెట్ నిర్మాణానికి ఖ‌ర్చు చేసారు. దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా ప‌క్కాగా రెడీ అయింది.

బ‌ల్గేరియా  నుంచి  పైట‌ర్లు రావ‌డం...రావు ర‌మేష్ ఈ షూటింగ్  పూర్తిచేసుకుని ఊటీ వెళ్లిపోవాల్సి ఉంది. దీంతో ఈ సీన్ షూట్ కి బృందం రెడీ అయిందిట‌. ఇంత‌లో గిల్డ్ బృందం షూటింగ్ కి అడ్డు ప‌డిన‌ట్టు స‌మాచారం. నిన్న‌టి రోజున షూటింగ్ ప్రారంభించ‌గా ఓ గిల్డు స‌భ్యురాలు..స‌భ్యుడు ఫోన్ చేసి ప‌రుషంగా మాట్లాడిన‌ట్లు నిర్మాత‌ల స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొచ్చింది.

ఔట్ డోర్  నుంచి వ‌చ్చిన వారిని హెచ్చ‌రించి ప‌ని నిలుపుద‌ల చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో చిత్ర నిర్మాత‌లు అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అసోసియేష‌న్ అన్న‌ది నిర్మాత‌ల క్షేమం చూడ‌క‌పోగా..ఇలా బెదిరింపుస‌ల‌కు పాల్ప‌డ‌ట‌టం ఏంట‌ని కౌన్సిల్ నేత సి.క‌ళ్యాణ్ నికి త‌మ బాధ‌ని విన్న‌వించుకున్న‌ట్లు స‌మాచారం.

దీంతో ఆయ‌న 18వ తేదీ నుంచి షూటింగ్ చేసుకునేలా వెసులుబాటు క‌ల్పించిన‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలో  విశ్వ‌క్ సేన్ కి బెదిరింపుస‌లు  వెళ్లిన‌ట్లు  మాట్లాడుకుంటున్నారు. సినిమా పూర్తిచేసి ఎలా విడుద‌ల చేస్తారో?  హెచ్చ‌రించిన‌ట్లు ఓ గిల్డ్ స‌భ్యుడు చెప్పిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో చర్చ‌కొచ్చింది.  అయితే మిగ‌తా సినిమాల్ని వ‌దిలేసి విశ్వ‌క్ సేన్ సినిమాని? ఎందుకు టార్గెట్ చేన‌సిన‌ట్లు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

హైద‌రాబాద్  ప‌రిస‌రాల్లో  చాలా సినిమాల షూటింగ్ లు జ‌రుగుతున్నాయి. వాళ్ల‌కి వెళ్ల‌ని బెదిరింపులు విశ్వ‌క్  సినిమా కే ఎందుకు వెళ్లిన‌ట్లు? ఇందులో వ్య‌క్తిగ‌త కోణం ఏదైనా ?  ఉందా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.  ఈ సందేహాల‌కి సంబంధించి విశ్వ‌క్ సేన్ కి ట‌చ్ లోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా? ఆయ‌న ఫోన్ అందుబాటులోకి రావ‌డం లేద‌ని  వినిపిస్తుంది. మ‌రి దీని వెనుక అస‌లేం జ‌రుగుతుంది?  గిల్డ్ స‌భ్యురాలి బెదిరింపులు వాస్త‌వమా?  కాదా? అన్న‌ది క్లారిటీ రావాలంటే అస‌లి వ్య‌క్తులు లైన్ లోకి వ‌స్తే త‌ప్ప సంగ‌తేటి? అన్న‌ది తేల‌దు. 
Tags:    

Similar News