తెలుగు అమ్మాయి అంజలి తమిళనాట స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దకాలం అయినా కూడా ఆమె జోరు కొనసాగుతూనే ఉంది. తమిళనాట మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అంజలి యొక్క జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. ముద్దుగుమ్మ అంజలి పెళ్లి గురించి పదే పదే వార్తలు వస్తున్నాయి.
ఆ మధ్య ఒక తమిళ హీరో తో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇద్దరు సహ జీవనం సాగిస్తున్నారు.. అదుగో పెళ్లి.. ఇదుగో పెళ్లి అన్నట్లుగా తమిళ మీడియాతో పాటు తెలుగు మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఏదో కారణం వల్ల అతడితో అంజలి బ్రేకప్ అయ్యిందని అదే తమిళ మీడియాలో మళ్లీ కథనాలు వచ్చాయి.
ఇప్పటి వరకు అంజలి తన ప్రేమ మరియు పెళ్లి గురించి ఏ విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు. పెళ్లి అయ్యిందంటూ వస్తున్న వార్తలను మరియు ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలను మాత్రం తాజాగా అంజలి ఖండించింది. తాజాగా ఒక మీడియా సంస్థ తో ఆమె మాట్లాడుతూ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది.
అంజలి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేనే లేదు. అయితే పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటాను. అది ఎవరిని అనే విషయం ఇప్పటికిప్పుడు చెప్పలేను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇది వరకే పెళ్లి అయ్యిందంటూ కొందరు చేస్తున్న ప్రచారం చిరాకు తెప్పిస్తుందని అంజలి అసహనం వ్యక్తం చేసింది.
పెళ్లి అయితే ధైర్యంగా బయటకు చెప్తాను.. నేను ఎవరిని చేసుకున్నాను అనే విషయాన్ని కూడా చెప్తాను అంటూ మీడియా తో మాట్లాడుతూ అంజలి పేర్కొంది. తమిళంతో పాటు తెలుగు లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఐటం సాంగ్స్ తో పాటు ప్రత్యేక పాత్రల్లో నటించేందుకు కూడా ఓకే చెప్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.