‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో చలపతి రావు మహిళల గురించి చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో చలపతిరావును అదే పనిగా టార్గెట్ చేయడం కొందరిని బాధించింది. క్షమాపణ చెప్పాక కూడా చలపతిరావును వదలకపోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ జాబితాలోకి తాజాగా క్యారెక్టర్ నటి అపూర్వ చేరింది. చలపతిరావు విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చలపతిరావును బాబాయ్ అని సంబోధిస్తూ.. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని.. ఆయన ఇండస్ట్రీలో ఏ అమ్మాయితోనూ అసభ్యంగా ప్రవర్తించింది లేదని అంది అపూర్వ. ఆమె ఇంకా ఏమందంటే..
‘‘చలపతి బాబాయి చాలా మంచి వ్యక్తి. ఆయనకు మాకు ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. ఐతే ఏం చెప్పినా కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఆలీ కూడా అంతే. ‘ఏమేసొచ్చావ్ పొద్దున్నే..’ అంటాడు. దాన్ని మనం ఎలా తీసుకుంటామన్నది ముఖ్యం. ఇంట్లో ఏం తినొచ్చావ్ అనే విషయాన్నే ఆలీ తన స్టయిల్లో అలా అడుగుతాడు. ఈ మాటల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం జబర్దస్త్ లాంటి ప్రోగ్రాముల్లో అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులే ఉంటున్నాయి. అవి లేకుండా షోలు నడిపించగలరా? వ్యూస్ వస్తాయా? యూట్యూబ్ లో చెత్త హెడ్డింగ్స్ పెట్టి జనాల్ని ఆకర్షించే వీడియోల మాటేంటి? మా ఇంట్లో పనేబ్బాయి ఉన్నాడు. దానికి.. ‘అపూర్వకు.. ఆ అబ్బాయికి రిలేషన్ తెలుసా’ అని హెడింగ్ పెడతారు. ఆటోమేటిగ్గా జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. వ్యూస్ కోసం అలా చేస్తుంటారు. కొందరు ఇలాంటి హెడ్డింగ్స్ చదవుకుండానే మా గురించి కామెంట్ చేస్తుంటారు.
చలపతి బాబాయ్ గురించి ఇలాంటి హెడ్డింగే చూశా. ‘షాకింగ్ న్యూస్.. సూసైడ్ అటెంప్ట్ చేసిన చలపతిరావు’ అని పెట్టారు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు తెలిసి బాబాయి ఇండస్ట్రీలో ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. ఆయన తప్పు చేసినట్లు ఒక్క అమ్మాయితోనైనా మీరు చెప్పించండి. ఓసారి నా కాలు ఆయనకు తగిలి సారీ చెబితే.. ‘నువ్వు నా బిడ్డవురా.. నువ్వెందుకు సారీ చెప్తావు’ అన్నారు. అదీ ఆయన సంస్కారం. పదిమందికి అన్నం పెట్టిన ఆ వ్యక్తి గురించి ఇప్పుడందరూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే బాధేస్తోంది. ఆయనేం టెర్రరిస్టు కాదు.. బాబాయ్ అన్నది తప్పే. కానీ ఆయన మంచివాడు. ఆ రోజు ఆయన్ని ఆ ప్రశ్న అడిగిన యాంకర్ కూడా తప్పు చేసినట్లే. ఆ అమ్మాయి మైకు పట్టుకుని వస్తోంది.. బాబాయి ఏమనేస్తారో అని ముందే భయపడ్డా. ఆయన అన్నది తప్పే అయినా.. కొవ్వుతోనో.. కామంతోనో ఆయనలా మాట్లాడలేదు. నోరు జారాడు కానీ వేరే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఆయన గురించి అన్నీ తెలిసిన చుట్టు పక్కల వాళ్లు తన గురించి మాట్లాడాలి. ఆయన కామెంట్లలో సెన్స్ ఇది కాదు అని చెప్పాలి’’ అని అపూర్వ అంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/