అదృష్టవంతులు ఎలా ఉంటారంటే మళయాళ నటి ’అర్చన కవి‘ లా ఉంటారనాలేమో. ఆమె ప్రయాణిస్తున్న కారుపై మెట్రో రైలు బ్రిడ్జి ముక్కులు విరిగి పడితే ఆమె సురక్షితంగా తప్పించుకున్నారు. కారు నుజ్జునుజ్జయ్యింది. తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆమె ఈ సంఘటనపై మైట్రో రైలు సంస్థకు, పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే, ఇప్పటికే ఈ మెట్రో బ్రిడ్జి నాణ్యతపై అనుమానాలున్న నేపథ్యంలో ఈ దుర్గటన మరిన్ని భయాలకు కారణమవుతోంది. ఈ ఘటన మళయాళ నటి ట్విట్టరులో వివరించారు.
ఎయిర్ పోర్టుకు నటి అర్చన కవి ఒక కారులో ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా... మెట్రో కు చెందిన ఓ కాంక్రీట్ పైకప్పు పలక ఒకటి విరిగి కారుపై పడింది. మేము ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాం. కోచి పోలీసులు, కోచి మెట్రో అధికారులు వెంటనే స్పందించి డ్రైవరుకు నష్టపరిహారం అందించాలని ఆమె కోరారు. అలాగే, ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోమని ఆమె వారిని రిక్వెస్ట్ చేశారు.
దీనికి కోచి మెట్రో అధికారులు కూడా వెంటనే స్పందించారు. డ్రైవరును కలిసి సమాచారం తెలుసుకున్నట్లు చెప్పారు. దీనిపై పూర్వాపరాలు తెలుసుకుంటున్నాం అంటూ ఈ దుర్ఘటనకు సారీ చెప్పారు. అయితే, పరిహారం గురించి ఏమీ పేర్కొనలేదు. వీలైనంత త్వరలో మిమ్మల్ని కలుస్తామంటూ ఆమెకు రిప్లయి ఇచ్చారు.
కోచి మెట్రో హైదరాబాదు మెట్రో కంటే ఆలస్యంగా ప్రారంభమై, హైదరాబాదు మెట్రో కంటే వేగంగా పూర్తయ్యింది. అప్పట్లో అభినందనలు వచ్చాయి గాని... ఈ ఘటనలతో దానిని హడావుడిగా కట్టేశారని ఇపుడు అనుమానాలు వస్తున్నాయి. కోచి మెట్రో బ్రిడ్జి భద్రతపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు ఎదురవుతుండటంతో మెట్రో అధికారులు తలపట్టుకుంటున్నారు.