200 కోట్ల దోపిడీ కేసులో ప్రముఖ నటి అరెస్ట్ కావడం సంచలనమైంది. 21 కేసుల్లో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యాపారవేత్త కేసులో ఆయన భార్య అయిన నటి అరెస్ట్ అయ్యింది. వ్యాపారవేత్త అయిన భర్తకు 200 కోట్ల రూపాయలు వసూలు చేసినందుకు సహాయపడినందుకుగాను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నటి లీనా మరియా పాల్‌ను ఆదివారం అరెస్టు చేశారు. నిందితులపై కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (MCOCA) చట్టాన్ని పోలీసులు ప్రయోగించారని, ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మాజీ ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌ను మోసం చేయడంలో నటి లీనా పాల్ చంద్రశేఖర్‌కు సహాయం చేశారని ఆయన అన్నారు.
గత ఏడాది జూన్‌లో న్యాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారిగా పేర్కొంటూ జైలులో ఉన్న తన భర్తకు బెయిల్ ఇవ్వడానికి సహాయం చేయాలని మోసం చేసినందుకు నటి లీనాపై ఆగస్టు 7న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
2019 లో రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ (RFL)లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివిందర్ సింగ్ అరెస్టయ్యాడు. ఎన్నికల కమిషన్ లంచం కేసుతో సహా 21 కేసుల్లో నిందితుడైన చంద్రశేఖర్ గత ఆగస్టులో అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో, చంద్రశేఖర్ ఢిల్లీలోని రోహిణి జైలులో ఉన్నాడు. ఈయన వెనుకాల అన్నీ తానై భార్య నటి లీనా దోపిడీ రాకెట్ నడుపుతున్నట్టు తేలింది.
చంద్రశేఖర్‌కి సహాయం చేసినందుకు రోహిణి జైలులోని ఇద్దరు సీనియర్ అధికారులతో పాటు జైలు వెలుపల నుండి అతని కోసం ఆపరేషన్ చేసిన అతని ఇద్దరు సహచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో కానాట్ ప్లేస్‌లోని ఒక బ్యాంక్ మేనేజర్.. అతని ఇద్దరు సహచరులు నిధుల ప్రసరణ.. నగదు అమరిక కోసం సందేహాస్పద లావాదేవీలలో పాల్గొన్నారని పోలీసులు కనుగొన్నారని, ఆ తర్వాత ముగ్గురుని అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.
రోహిణి జైలు అధికారులు తమకు సహాయం చేశారని చంద్రశేఖర్ సహచరులు వెల్లడించినట్లు అదనపు పోలీసు కమిషనర్ (ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్) ఆర్ కె సింగ్ తెలిపారు. "అసిస్టెంట్ జైలు సూపరింటెండెంట్.. రోహిణి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఈ రాకెట్‌లో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. వారు నిందితులకు సహాయం చేసినట్లు అంగీకరించారు. ఇద్దరు జైలు అధికారులను కూడా అరెస్టు చేశారు" అని పోలీసులు చెప్పారు.