బాల‌య్య‌తో మ‌నోభావాల బ్యూటీ అనుభ‌వాలు!

Update: 2022-12-26 16:17 GMT
న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 107వ చిత్రం `వీర‌సింహారెడ్డి` సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంకంత‌కు అంచ‌నాలు పెంచేస్తున్నాయి. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని వ్యాఖ్య‌లు అభిమానుల్లో అంత‌కంత‌కు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి.
న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 107వ చిత్రం `వీర‌సింహారెడ్డి` సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంకంత‌కు అంచ‌నాలు పెంచేస్తున్నాయి. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని వ్యాఖ్య‌లు అభిమానుల్లో అంత‌కంత‌కు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి.

హిట్ కొట్ట‌బోతున్నాము...రెడీగా ఉండండి అంటూ జోష్ నింపుతున్నారు. తాజాగా `మాబావ‌ మ‌నోభావాలు` అంటూ బాల‌య్య కొత్త‌పాట మార్కెట్ ని  షేక్ చేస్తుంది. ఇందులో బాల‌య్య‌తో క‌లిసి చంద్రిక ర‌వి అనే బ్యూటీ ఆడిపాడింది. తాజాగా ఓ వీడియో రూపంలో సినిమాలో బాల‌య్య తో  త‌న అనుభ‌వాల్ని  పంచుకుంది.

నేను సౌత్ సినిమాలు చూసి పెరిగాను. బాల‌కృష్ణ న‌టించే..సినిమాలు పాట‌లు త‌రుచూ చూస్తాను.  ఆయ‌న‌తో తెర‌ను పంచుకోవ‌డ‌మే కాదు..క‌లిసి  డాన్స్ చేయ‌డం సంతోషంగా ఉంది. మొద‌టి రోజు సెట్స్  కి వెళ్తుంటే?  నాక‌ల నిజ‌మైంది అని  అనిపించింది. నాలో నేను ఆ మాట ప‌దే ప‌దే అనుకున్నాను. మ‌నోభావాలు పాట‌కు అన‌ని స‌రిగ్గా కుదిరాయి.

బాల‌కృష్ణ‌తో క‌లిసి ఎంతో స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం ద‌క్కింది. ఆయ‌న జీవితానికి...కెరీర్ కి సంబంధించిన అనేక విష‌యాలు నాతో పంచుకున్నారు. బాల‌య్య బాబు మోస్ట్ ట్యాలెంట్ న‌టుడు. ఆయ‌న‌తో సెట్ లో  గ‌డిపిన రోజులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఈ సినిమా జీవితాంతం గుర్తిండి పోతుంది. ఈ అమ్మ‌డు ఆస్ర్టేలియా నుంచి దిగుమ‌తి అయింది.

న‌టిగా  ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లు పెట్టింది. ఆర‌భంలోనే బాల‌య్య‌తో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుని మీడియాలో ఫోక‌స్ అవుతుంది.  `మ‌నోభావాలు` పాట‌తో నెట్టింట మాత్రం జోరుగా వైర‌ల్ అవుతుంది. మ‌రి అసిస్ బ్యూటీ కెరీర్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.  సీనియ‌ర్ హీరోల‌కు త‌గ్గ నాయిక‌. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ ప‌నికొస్తుంది. మ‌రి బ్యూటీకి టాలీవుడ్ అవ‌కాశాలిచ్చి  ప్రోత్స‌హిస్తుందా?  లేదా? అన్న‌ది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News