డ్రగ్స్ కేసులో తన పేరు ప్రచారం చేయడంపై నటి హేమ ఫైర్

Update: 2022-04-03 07:30 GMT
హైదరాబాద్ లో మరో భారీ రేవ్ పార్టీ బయటపడింది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఉన్నట్టు చెబుతున్నారు. ఫండింగ్ మింక్ అనే పబ్ పై అధికారులు దాడులు చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు.  

ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో డ్రగ్స్ తీసుకున్నవారు మాత్రమే  ఉన్నారు. మిగతా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించినట్టు తెలిసింది.  పట్టుబడిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక -  రాహుల్ సిప్లిగంజ్ సహా మిగతా వారికి నోటీసులు అందించి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు.

ఇక నటి హేమ తన పేరును ఒక న్యూస్ చానెల్ వాడుకుందని పోలీసులకు ఆ న్యూస్ చానెల్ పై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే తన పేరును ఎలా వేస్తారంటూ మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగింది హేమ. ఓ మీడియా చానెల్, ఆ ప్రతినిధి తన పేరును మీడియాలో ప్రసారం చేస్తున్నారని మండిపడింది. కనీసం ఆరాతీయకుండా ఇలా చేస్తారా అంటూ సదురు చానెల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అనంతరం హేమ మీడియాతో మాట్లాడిన సదురు న్యూస్ చానెల్ ను తిట్టిపోశారు. ఇది సరైంది కాదంటూ మండిపడ్డారు. తన పేరు, తన కూతురు పేరు అంటూ డ్రగ్స్ కేసుల్లో మీడియాలో అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Tags:    

Similar News