2018 కి టాటా చెప్పి, 2019 కి వెల్కం చెప్పేందుకు ఇంకో 26 రోజులే మిగిలి ఉంది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టకముందే యూత్ కి విందు పసందు కావాలి కదా? ఈసారి టాలీవుడ్ నుంచి స్పెషల్ ఏం ఉంది? అంటే అందుకు సంబంధించిన టాప్ సీక్రెట్స్ రివీల్ అయ్యాయి. ప్రతియేట లానే ఈ ఏడాది కూడా అందాల కథానాయికలతో మస్త్ మజా మస్తీ షోలు చాలానే నగరంలో ఉన్నాయి. ఇప్పటికే కథానాయికల్ని బుక్ చేసుకుంటూ పబ్బులు- క్లబ్బులు- రెస్టారెంట్- రిసార్ట్స్ ప్లేసు ల్లో- సిటీ ఔట్ స్కర్ట్స్ లో భారీ ఈవెంట్లకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకూ ఏ ఏ కథానాయికలకు ఈ తరహా ఆఫర్లు వచ్చాయి? అన్న సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లందరికీ ఈవెంట్లకు సంబంధించిన ప్రపోజల్స్ వెళ్లాయట. అలాగే ఇటీవలి కాలంలో టాలీవుడ్లో తెలుగమ్మాయిల రైజింగ్ బావుంది కాబట్టి, వీళ్లకు కూడా భారీగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే పలువురు అందాల కథానాయికలు 31 రాత్రి ఈవెంట్ల కోసం లాక్ అయ్యారట. అలాగే భారీ గా స్టార్ హీరోయిన్లతో నిర్వహించనున్న ఓ ఈవెంట్లో తెలుగమ్మాయిలు యామిని భాస్కర్, నిత్యా శెట్టి, అలేఖ్య వంటి వాళ్లు పార్టిసిపెంట్లుగా ఉంటారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే సదరు తెలుగమ్మాయిలతో బ్రోచర్ కార్యక్రమాలు జరగడం విశేషం. అసలింతకీ ఈ ఈవెంట్లలో పాల్గొనే స్టార్ హీరోయిన్లు ఎవరు? అన్నది తెలియాల్సి ఉందింకా. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ.. 31 రాత్రి సెలబ్రేషన్స్ కోసం యూత్ ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూడడం సహజం. అలాంటి ఉత్సాహం ఉరకలెత్తే యూత్ కోసం భారీ మస్తీ ఈవెంట్లకు నగరం సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచే టిక్కెట్లు బుక్ చేసుకుంటేనే అప్పటికి వీలు చిక్కుతుంది. లేదంటే చివర్లో టిక్కెట్లు దొరకడం కష్టమేనని అంటున్నారు.
ఈ ఈవెంట్లకు సంబంధించి ఇప్పటికే బుక్ మై షో సహా పలు వెబ్ సైట్లు ప్రచారంలో ఊదరగొట్టేస్తున్నాయి. 31 నడిరేయిలో మత్తుగా చిత్తుగా ఊగుతూ తూగుతూ సెలబ్రేషన్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే కాస్త ముందస్తుగానే లవర్స్, బోయ్స్, గాళ్స్ ప్రిపేరవ్వాల్సి ఉంటుందేమో? ఈసారి ఈవెంట్లకు కపుల్ టిక్కెట్లు రూ.3000 నుంచి రూ.10,000 అంతకుమించి ఫిక్స్ చేస్తున్నారట. హైదరాబాద్ - రామోజీ పిలింసిటీలోనూ భారీ ఈవెంట్లకు సన్నాహాలు చేస్తున్నారు.