తెలుగు తెరపై జయలలితను చూసినవాళ్లు .. ఈమె ఎందుకు శృంగారభరితమైన పాత్రలను చేస్తోంది .. హీరోయిన్ కి కావలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కదా అనుకున్నారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ కంటే జయలలితనే అందంగా ఉందని కూడా చెప్పుకున్నారు. క్లాసికల్ డాన్సర్ అయ్యుండి .. ఎందుకు ఐటమ్ సాంగ్స్ చేస్తోందనే ఆలోచనలో పడ్డారు. చాలాకాలం క్రితమే వెండితెరకి పరిచయమైన ఆమె, ఈ తరహా పాత్రలను చేసే వారిలో ఇంతటి అందగత్తె లేదని చెప్పుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సీరియల్స్ చేస్తూ వస్తున్నారు. అలాంటి జయలలిత తాజాగా 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా తన గురించిన విషయాలను చెప్పుకున్నారు.
"మా అమ్మగారిది గుడివాడ .. మా నాన్నగారిది పొన్నూరు. నా చదువు అంతా కూడా గుంటూరులో సాగింది. కాలేజ్ రోజుల్లో నాకు కుప్పలుగా లవ్ లెటర్స్ వచ్చేవి. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ ని నేర్చుకున్నాను. ఆ డాన్స్ కారణంగానే కమల్ గారు కథానాయకుడిగా చేసిన ఒక సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఆ తరువాత చిరంజీవిగారి 'ఖైదీ' సినిమాలో సుమలత పాత్ర కోసం ముందుగా నన్ను అనుకున్నారు .. కానీ దురదృష్టం వలన ఆ ఛాన్స్ పోయింది. సరైన గైడన్స్ ఉండేది కాదు. కుటుంబాన్ని పోషించడం కోసం ఏ పాత్ర వచ్చినా చేస్తూ వెళ్లాను. అలా నేను ఈ తరహా పాత్రలు ఎక్కువగా చేయవలసి వచ్చింది.
నేను బాగానే సంపాదించాను .. ఖరీదైన కార్లలో తిరిగాను. కానీ ఒక ఫ్యామిలీతో ఉన్న పరిచయం కారణంగా గుడ్డిగా నమ్మేసి వాళ్లకి అప్పుగా 4 కోట్లు ఇచ్చాను. వాళ్లు నన్ను మోసం చేసేసి వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని వెళ్లి, ఎంతో కొంత ఇవ్వమని అడిగాను .. అయినా వాళ్లు పట్టించుకోలేదు. వాళ్లపై కేసు పెట్టాను .. అది నడుస్తోంది. ప్రస్తుతం నేను సొంత కారు కూడా లేక 'క్యాబ్' లలో తిరుగుతున్నాను. రోజువారీగా వచ్చే డబ్బుల కోసం సీరియల్స్ చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.