బ‌యోపిక్ లో సూర్య స‌తీమ‌ణి!

Update: 2022-11-20 02:30 GMT
సూర్య స‌తీమ‌ణి..న‌టి  జ్యోతిక సెకెండ్ ఇన్నింగ్స్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు మంచి భ‌ర్త‌గా..బిడ్డ‌ల‌కు త‌ల్లిగా సేవ‌లందిస్తూనే... సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. అలాగే సొంత నిర్మాణ సంస్థ ప‌నుల్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. సూర్య వ్య‌క్తిగ‌త సిబ్బందిని సైతం జ్యోతిక‌నే మోనిట‌ర్ చేస్తుంటారు.

ఆర‌కంగా భ‌ర్త‌కు సేవ‌లు చేసుకోవ‌డంలో భాగంగా  అద‌న‌పు  బాధ్య‌త‌గా తీసుకున్నారు. రేర్ గా సూర్య న‌టించిన సినిమా ఈవెంట్ల‌లో సైతం క‌నిపిస్తుంటారు. అయితే న‌టిగా కంబ్యాక్ అయిన త‌ర్వాత ఆ త‌ర‌హా కార్య‌క్ర‌మాల‌కు రావ‌డం త‌గ్గించారు. నేరుగా ఆమె న‌టిస్తోన్న  సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. తాజాగా జ్యోతిక కి ఓ బ‌యోపిక్ లో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది.

దివ్యాంగ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్ల జీవిత క‌థ ఆధారంగా ఓ చిత్రం తెర‌క‌క్కుతోంది. ఇందులో శ్రీకాంత్ పాత్ర‌ని బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు పోషిస్తున్నారు.  `సాండ్ కీ అంక్` త‌ర్వాత తుషార్ హిరానం దానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఇందులో ఓ కీల‌క‌మైన పాత్ర బాధ్య‌త‌లు జ్యోతిక‌కి అప్ప‌గించారు. ఆ పాత్ర క‌థ‌ని న‌డ‌పిస్తుంద‌ని..తెర‌పై క‌నిపించినంత సేపు ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ని స‌మాచారం.

వాస్త‌వానికి జ్యోతిక ముందుకు ఈ సినిమాకి  సంబంధించి  రెండు పాత్ర‌లు వెళ్లాయట‌. రెండు పాత్ర‌ల నేరేష‌న్ త‌ర్వాత ఓ పాత్ర‌లో న‌టించ‌డానికి ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే పారితోషికం విష‌యంలో జ్యోతిక ప‌ట్టు ప‌ట్ట‌లేదుట‌. నిర్మాత‌లు ఆఫర్ చేసిన బ‌డ్జెట్ లో స‌ర్దుకుంటాన‌ని చెప్పారుట‌. అలాగే  మ‌రో పాత్ర‌లో  యువ న‌టి ఆల్యా ఎఫ్ని తీసుకున్నారు.

ఈ పాత్ర కూడా సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా  నిలుస్తుంద‌ని స‌మాచారం. ఈనెలాఖ‌రుక‌ల్లా సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ముంబై..హైద‌రాబాద్తో పాటు  దేశంలో ప‌లు ప‌ట్ట‌ణాల్లోనే సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నుందిట‌. అవ‌స‌ర‌మైన స‌న్నివేశాల కోసం విదేశాలు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ బ‌యోపిక్ కోసం ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స్పూర్తిదాయ క‌మైన చిత్రాలు మ‌రిన్ని  రావాల‌ని ప్రేక్ష‌కులు ఆశిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News