కంటెంట్ మిస్సయితే.. ఖుష్బూ అంటారెంటి?

Update: 2023-05-09 05:00 GMT
ప్రతి ఒక్క డైరెక్టర్, నటీనటులు హిట్ అవ్వాలనే సినిమా తీస్తారు. కానీ కంటెంట్ బాగోకపోవడమో, అదృష్టం లేకపోవడమో, డైరెక్టర్ టేకింగ్ వల్లనో, ఇలా ఏదో  కారణంతో సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి. సినిమా ప్లాప్ టాక్ రాగానే ప్రేక్షకులు దానిని ఎవరిమీదో ఒకరి మీద వేసేస్తూ ఉంటారు. వారి వల్లే సినిమా ప్లాప్ అయ్యింది అని ఆ నేరం వారి మీద వేసేస్తూ ఉంటారు. ఇదే వరసగా, రెండు,మూడు సినిమాలకు జరిగితే ఆ నటి లేదంటే నటుడు మీద తోసేస్తారు. వారి మీద ఐరన్ అంటూ అనేస్తూ ఉంటారు.

ఇలాంటి మాటలు పాపం ఎక్కువగా హీరోయిన్లకు వినిపిస్తూ ఉంటుంది. వారు నటించిన సినిమాలు వరసగా హిట్ అయితే గోల్డెన్ లెగ్ అని, ప్లాప్ అయితే ఐరన్ లెగ్ అనేస్తూ ఉంటారు. అయితే, ఈ మధ్యకాలంలో కంటెంట్ బాగోక ప్లాప్ అయిన కొన్ని సినిమాల ఫలితాన్ని కీలక పాత్ర పోషించిన ఓ సీనియర్ నటిపై వేయడం గమనార్హం.ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కాదు, అవేమీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కావు. కేవలం హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలు చేశారు. కానీ, వాటి ప్లాప్ ఫలితం మాత్రం ఆమె పై నెట్టేశారు.

ఆమె ఎవరో కాదు, ఒకప్పటి అందాల తార ఖుష్బూ. ఆమె నటించిన అగ్నాతవాసి,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తాజగా రామ బాణం సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. నిజానికి ఈ మూడు సినిమాలు ప్లాప్ అవ్వడానికీ ఖుష్బూకీ ఎలాంటి సంబంధం లేదు. ఆమె అందులో నటించారు అన్నది తప్ప, వాటి ప్లాప్స్ కి ఆమె కనీసం బాధ్యత వహించాల్సిన అవసరం కూడా లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు ఖుష్బూని టార్గెట్ చేస్తున్నారు.

ఈ మూడు సినిమాల్లో ఖుష్బూ నటించింది కాబట్టి, ఇవి ప్లాప్ కావడానికి ఆమె కారణం అంటూ విమర్శిస్తున్నారు. ఆ మూడు సినిమాల్లో కంటెంట్ బాలేదు, స్టోరీ బాగోకపోవడం వల్లే అవి నెగిటివ్ టాక్ తో పోయాయి. పవర్ స్టార్ పవన్ స్టార్ డమ్ కూడా అగ్నాతవాసికి కలిసి రాలేదు అంటే అది స్టోరీ లైన్ సరిగా లేకపోవడం. కాస్తో, కూస్తో పాటలు బాగుంటాయి అంతే. ఫ్యాన్స్ కి కూడా ఆ సినిమా నచ్చలేదు.

ఇక ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో టైటిల్ సాంగ్ కి మించి గుర్తుంచుకోవడానికి ఏమీ లేదు. రామ బాణంలో అయితే, కనీసం పాటలు కూడా ఆకట్టుకోలేదు. మరి ఏ విధంగా ఈ సినిమాలు హిట్ అవుతాయి..? కంటెంట్ మిస్స్ అయితే ఖుష్బూని అంటారేంటి? అని కొందరు వాదిస్తున్నారు. నిజమే కదా, కేవలం ఆమె నటించినంత మాత్రాన ఆ ప్లాప్ బారం ఖుష్బూ మీద వేయడం కరెక్ట్ కాదు కదా? మీరేమంటారు?

Similar News