ఎనభైలు తొంబైలలో అగ్ర కథానాయికగా వెలిగిపోయిన ఖుష్బూ ఆ తర్వాత దర్శకుడు సుందర్.సి ని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమార్తెలు అవంతిక - ఆనందిత ఉన్నారు. ప్రస్తుతం సీనియర్ నటీమణిగా ఇండస్ట్రీలో అవకాశాల్ని అందుకుంటున్నారు. కెరీర్ ఆరంభం విక్టరీ వెంకటేష్ .. కింగ్ నాగార్జున లాంటి స్టార్ల సరసన నటించిన ఖుష్బూ మెగాస్టార్ స్టాలిన్ లోనూ కీలక పాత్రలో నటించి మెప్పించారు.
ఆ తర్వాత సినీకెరీర్ కి బ్రేక్ వేసి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం భాజపా మహిళా నాయకురాలిగా కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఖుష్బూ ఇటీవల రంగుల ప్రపంచంలోకి రీఎంట్రీ ఇవ్వడం చర్చకొచ్చింది. ప్రస్తుతం శర్వానంద్ `ఆడాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేస్తున్నారని తెలిసింది.
గత కొంతకాలంగా ఖుష్బూ సోషల్ మీడియా ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఖుష్బూ లుక్ అమాంతం మారింది. ఇప్పుడు యాభై నుంచి ఇరవైకి షిఫ్ట్ అయ్యారా? అంటూ అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యేంతగా గొప్ప మేకోవర్ తో కనిపిస్తున్నారు. అయితే ఇంత వేగంగా అంత టూమచ్ గా ఎలా స్లిమ్ అయ్యారు? అంటూ ఒక సెక్షన్ ఆరాలు మొదలు పెట్టింది. ఇటీవల ఖుష్బూ ఈ రూపం కోసం కఠినవ్యాయామాలు చేస్తున్నారు. ఆహార నియమాల్ని పాటిస్తున్నారు. సహజసిద్ధంగా చేసిన ప్రయత్నం కొంతవరకూ అక్కరకొచ్చింది.
తాజాగా షేర్ చేసిన ఫోటోలకు స్టన్నయిపోయిన యూత్ ఖుష్బూ 21 ఎఫ్ అంటూ పొగిడేస్తున్నారు. నిజంగానే కుమారి 21 ఎఫ్ లా మారి ఖుష్బూ కన్ఫ్యూజ్ చేస్తున్నారని యూత్ అభిప్రాయపడుతోంది. మారిన రూపాన్ని బట్టి ఇకపై సహాయక పాత్రల్లో నటించేందుకు ఖుష్బూ ప్రిపరేషన్ లో ఉన్నారని అర్థమవుతోంది. అక్క చెల్లి లేదా వదినమ్మ.. అత్తయ్య పాత్రలకు ఖుష్బూ ఫిట్ గా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.