పూజా హెగ్డే.. వ్వాటే లుక్ మేడమ్!

Update: 2022-12-22 17:30 GMT
బుట్ట బొమ్మ అనే ట్యాగ్ తో గత కొంతకాలంగా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా తన క్రేజ్ పెంచుకోవాలని చూస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.

మరీ వల్గర్ గా కూడా కాకుండా ఎంతో స్టైలిష్ గా ఉండేలా కూడా ఆమె జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇక పూజ హెగ్డే రీసెంట్ గా పోస్ట్ చేసిన మరికొన్ని ఫోటోలు కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అమ్మడు ప్యాంటు షర్టులో రెగ్యులర్ గా కనిపించినప్పటికీ కూడా ఒకవైపు నడుము అందాలను మరొకవైపు ఏద అందాలను కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసింది.

పూజ హెగ్డే ఎలా కనిపించిన అందమే అని మరోసారి రుజువు చేసింది. ఇక పూజ హెగ్డే ప్రస్తుతం అతిపెద్ద సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. ఆమె ఈ ఏడాది చేసిన సినిమాలు ఆచార్య రాధే శ్యామ్ రెండు కూడా తీవ్రస్థాయిలో నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మాత్రం బాలీవుడ్ లోనే పూజా రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది.

రణవీర్ సింగ్ తోనే సర్కస్ అనే సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ తో కిసి కి భాయ్ కిసికి జాన్ అనే సినిమా చేస్తోంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ మెయిన్ హీరోయిన్ గా నటించబోతోంది.

అలాగే చర్చల దశలో మరికొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టు కోసం కూడా పూజా హెగ్డేను తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ డేట్స్ కుదరకపోవడం వలన ఈ బ్యూటీ ఆ ప్రాజెక్టు చేయడానికి అంగీకారం తెలుపడం లేదని తెలుస్తోంది. ఇక తమిళంలో కూడా ఒక ప్రాజెక్టులో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News