మలయాళంలో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న రజిషా విజయన్.. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''జై భీమ్'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అంతకముందు ధనుష్ తో చేసిన 'కర్ణన్' మూవీ కూడా అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మలయాళ తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ''. ఇందులో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ తో పాటుగా రాజిషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
''రామారావు ఆన్ డ్యూటీ'' చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్టుగా హీరోయిన్ రజిషా విజయన్ మీడియాతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటుగా తన ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
తెలుగులో నటించాలనే కోరిక మొదట్నుంచీ ఉందని.. తగిన కథ కోసం ఎదురు చూసి ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా చేశానని రజిషా చెప్పింది. నేను తమిళంలో చేసిన 'కర్షన్' సినిమా చూసి డైరెక్టర్ శరత్ మండవ నాకు ఫోన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. బలమైన కథతో కూడిన ఓ మాస్ సబ్జెక్ట్ ఇది. అందులో మాలిని పాత్ర బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పా అని తెలిపింది.
ఒక కొత్త భాషలో పరిచయం అవుతున్నప్పుడు బలమైన కథ, పాత్ర అవసరమవుతాయి. నేను ఎదురు చూసిన కొలతలతోనే మాలిని పాత్రని అందంగా బలంగా డిజైన్ చేశారు. ఇంత మంచి పాత్రతో తెలుగుకి పరిచయం అవుతుండడం ఆనందంగా ఉంది అని రజిషా అన్నారు. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నా.. త్వరలోనే స్వయంగా డబ్బింగ్ చెబుతానని పేర్కొంది.
నేను ఉత్తరాదిలో పెరిగాను. నాన్న ఆర్మీలో, ఆ తర్వాత సీబీఐలో పని చేసారు. ఎప్పుడూ ట్రాన్సఫర్స్ ఉండటం వల్ల నేను కేరళలో ఎక్కువ నివసించలేదు. నేను ఎక్కువగా హిందీలోనే సినిమాలు చూశాను. రవితేజ చిత్రాలు కూడా హిందీలో డబ్ అయ్యేవి. నాకూ, నా స్నేహితులందరికీ రవితేజ తెలుసు. అప్పుడు ఆయన్ని నేను హిందీ హీరో అనుకున్నాను అని రజిషా విజయన్ చెప్పింది.
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే రవితేజకు చాలా కాలం క్రితమే రీచ్ ఉంది. నేను అతని అభిమానిని. ఆయనొక సూపర్ స్టార్. అలాంటి మాస్ హీరోతో నటించడం గొప్ప అనుభవం. రవితేజ సార్ చాలా హంబుల్ గా జెన్యూన్ గా ఉంటారు. ఆయన సెట్ కి వస్తే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది. అందరినీ సమానంగా చూస్తే వ్యక్తిత్వం ఆయనది అని తెలిపిందీ కర్ణన్ బ్యూటీ.
మలయాళ తమిళంతో పోలిస్తే తెలుగులో ఎక్కువ బడ్జెట్ సినిమాలు రూపొందుతాయని నేను గమనించాను. పెద్ద కాన్వాస్ చిత్రాలను తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. మలయాళంలో సింగిల్ షెడ్యూల్స్ లో పని చేస్తుంటాం. కానీ ఇక్కడ వివిధ షెడ్యూళ్లలో పనిచేయడానికి అవకాశం ఉంది. ఇది మాకు ఈజీ అవుతుంది.
ఓటీటీ కారణంగా, మనమందరం భాషా అడ్డంకిని తొలగించామని నేను భావిస్తున్నాను. వివిధ భాషల సినిమాలు చూస్తున్నాం. అందుకే సౌత్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలుగా ఎలా మారుతున్నాయో చూసి బాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. మన సినిమాలు అంతటా ప్రయాణిస్తున్నాయి అని రాజిషా విజయ్ చెప్పుకొచ్చింది.