తెలుగు సినిమాను హిందీ సినిమాగా మార్చేస్తున్నావ సమంత?

Update: 2022-10-02 02:30 GMT
సమంత తాజాగా నటించిన రెండు తెలుగు సినిమాలు ఏంటీ అంటూ ప్రశ్నిస్తే ప్రేక్షకుల నుండి వచ్చే సమాధానం శాకుంతలం మరియు యశోద. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు సినిమాలే కాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్నాయి అనేది టాక్‌. కానీ ఇప్పుడు యశోద సినిమాను హిందీ సినిమా అన్నట్లుగా ప్రచారం చేయాలని సమంత నిర్మాతలతో చెబుతుందట.

ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యశోద గురించి ఇప్పటి వరకు తెలుగు లో పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసింది లేదు. సినిమా విడుదల తేదీ ప్రకటించలేదు కనుక ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు అనుకుందాం... కానీ యశోద ప్రమోషన్స్‌ ఉత్తర భారతంలో నడుస్తూనే ఉన్నాయట.

పలు మల్టీ ప్లెక్స్‌ స్క్రీన్స్ ల్లో యశోద టీజర్‌ ను స్క్రీనింగ్‌ చేయడం ద్వారా ఇది ఒక హిందీ సినిమా అన్నట్లుగా అక్కడి వారికి ఫీల్ కలిగేలా చేస్తున్నారట. సమంతకి ఇప్పటికే మంచి గుర్తింపు ఉత్తర భారతంలో ఉంది. కనుక యశోద సినిమాను హిందీ సినిమా గా ప్రమోట్‌ చేసి విడుదల చేస్తే ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్‌ టాక్ వస్తే భారీ గా వసూళ్లు నమోదు అయ్యే అకవాశం ఉంది.

యశోద సినిమా తో పాటు శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెల్సిందే. యశోద హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే శాకుంతలం కూడా అక్కడ భారీ ఎత్తున ప్రమోట్‌ చేసే అవకాశాలు లేకపోలేదు.

మొత్తానికి సమంత సౌత్‌ పై కంటే ప్రస్తుతం నార్త్‌ పై ప్రేమ చూపిస్తుంది. అక్కడ సినిమాలు.. సిరీస్‌ లతో ముందు ముందు బిజీ అవ్వబోతుంది. ఇన్నాళ్లు ఇక్కడి సినిమాలు అక్కడ డబ్‌ అయ్యేవి.. ఇప్పుడు అక్కడ సామ్‌ చేసిన సినిమాలు ఇక్కడ డబ్‌ అవుతాయేమో అంటూ ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News