అనుష్క ఒప్పుకుంటే కొహ్లీతో పెళ్లికి రెడీ!

Update: 2021-09-09 16:31 GMT
టీమ్ ఇండియా  కెప్టెన్ విరాట్ కొహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ అమ్మాయిల్లో క్రేజ్ అసాధార‌ణం. కొహ్లీ స్టైలిష్ బ్యాట్స్ మెన్ మాత్ర‌మే కాదు అంత‌కు మించి ఫ్యాష‌నిస్టా కూడా. న్యూ ట్రెండ్స్ ని ప‌రిచ‌య‌డం చేయ‌డంలో ముందుంటారు. కొహ్లీ ఇమేజ్ రెట్టింపు అవ్వ‌డానికి ఆ స్టైలిష్ యాటిట్యూడ్ కూడా ఓ కార‌ణంగా చెప్పొచ్చు. తాజాగా కొహ్లీ అంటే పిచ్చి అని  బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది. అనుష్క శ‌ర్మ ఒప్పుకుంటే రెండ‌వ పెళ్లి కూడా చేసుకోవ‌డానికి కూడా  వెనుకాడ‌న‌ని  మృణాల్ ప్ర‌క‌టించ‌డం షాకిస్తోంది. విరాట్ బ్యాచిల‌ర్ గా ఉన్న స‌మ‌యంలోనే త‌న‌ని అమితంగా ఇష్ట‌ప‌డిందిట‌.

కొహ్లీ కోసం వెళ్ల‌ని క్రికెట్ స్టేడియం లేద‌ని అంటోంది. త‌న సోద‌రుడికి క్రికెట్ అంటే ఇష్ట‌మ‌ని..ఆ కార‌ణంగా సోద‌రుడితో క‌లిసి క్రికెట్ చూడ‌టం మొద‌లైన నాటి నుంచి.. తొలి చూపులోనే విరాట్ ని ఇష్ట‌ప‌డిన‌ట్లు తెలిపింది. ఇష్టాన్ని మించిన పిచ్చి కూడా ఉంద‌ని బ‌హిర్గ‌తం చేసింది. బ‌హుశా పెళ్లైన మ‌గాడిని  మ‌రో ఆడ‌ది త‌నంత ఇష్టంగా ప్రేమ చూపించ‌క‌పోవ‌చ్చ‌ని చెప్పింది. ఇక్క‌డ మ‌రో ఊహించ‌నిది కూడా చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం మృణాల్  బాలీవుడ్ లో `జెర్సీ` రీమేక్ లో న‌టిస్తోంది. ఇది టాలీవుడ్ లో విజ‌యం సాధించిన క్రికెట్ నేప‌థ్య చిత్రం. కొహ్లీని ఇష్ట‌ప‌డిన మృణాల్ నేడు `జెర్సీ`లో న‌టించ‌డంతో న‌టిగా చాలా సంతోషంగా ఉంద‌ని  తెలిపింది.

ఐదేళ్ల క్రితం  టీమ్ ఇండియా జెర్సీ ధ‌రించి గ్యాల‌రీలో కూర్చొని ఇండియా ఇండియా అంటూ కేరింత‌లు కొట్టిన రోజులు మ‌ళ్లీ క‌ళ్ల ముందు క‌దులుతున్నాయ‌ని తెలిపింది. సినిమాలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ చిత్రానికి మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్ తిన‌న్న‌నూరి హిందీలో కూడా తెర‌కెక్కిస్తున్నారు.  మృణాల్ బాలీవుడ్ లో `సూప‌ర్ 30`..`బాట్లా హౌస్`..` ఘోస్ట్ స్టోరీస్` చిత్రాల్లో న‌టించింది. ఆ చిత్రాలు స‌క్సెస్ అవ్వ‌డంతో అమ్మ‌డికి అన‌తి కాలంలోనే  మంచి గుర్తింపు ల‌భించింది.
Tags:    

Similar News