స్కూల్లో బోంగ‌రాలు కొట్టేసిన హీరోయిన్!

Update: 2022-12-14 02:30 GMT
బాల్యంలో అల్ల‌రి...చిల్ల‌ర‌..తుంట‌రి ప‌నులు  స‌హ‌జం. తెలిసి..తెలియ‌ని వ‌య‌సులో స్కూల్లో ప‌క్కోడి పెన్సిల్..బ‌ల‌పాలు కొట్టేయ‌డం  జ‌రుగుతుంటుంది. వాళ్లు స్నేహితులుగా మారితే ఏదొ ఒక రోజు వాటిని తిరిగిచ్చేసే మంచి బుడ్డొళ్లు ఉన్నారు. కానీ ఈ భామ మాత్రం చాలా డిప‌రెంట్ గురూ. ఈ మె స్కూలింగ్ లో  పుస్త‌కాలు...ప‌ల‌క‌లు..బ‌ల‌పాలు కొట్టేయ‌లేదు. ఆడుకునే బొంగ‌రాలు కొట్టేసిందిట‌.

ఎందుకు కొట్టేసావ్ అంటే?  అవి గుడ్రంగా తిర‌గ‌డం న‌చ్చి వాటిని దొంగిలించిన‌ట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవ‌రా భామ అటే? ఆమె ఎవ‌రో కాదు. జీవితారాజ‌శేఖర్ ముద్దుల కుమార్తె శివానీ. ఇప్పుడు పెరిగి పెద్దై హీరోయిన్ అయిపోయింది. కానీ ఈ బ్యూటీ స్కూల్లో అన్ని అల్ల‌రి ప‌నులు చేసేదింట‌. అలాంటి తుంట‌రి ప‌నుల్లో ఇలా బొంగ‌రాలు కొట్టేయ‌డం ఒక‌టి.

వాటిని దొంగిలించి ఇంటికి తెచ్చి ఆడుకునేదిట‌. ఇంటికి తెచ్చిన బొంగ‌రాల్ని అదే ప‌నిగా క‌ళ్ల‌ప్ప‌గించి చూసేదిట‌. వాటిని ఓ తాడుకి గ‌ట్టిగా క‌ట్టి నేల‌పై గిరేసి రౌండుగా తిరుగుతుంటే?  తెగ సంబ‌రప‌డిపోయేదంట‌. మ‌రి ఈ విష‌యం అమ్మా-నాన్న‌ల‌కు తెలుసో తెలియ‌దో? మ‌రి స్కూల్ డేస్ లో బొంగ‌రాలే కొట్టేసిందా? ఇంకేమైనా కొట్టేసిందా? అన్న‌ది తెలియ‌దు సుమీ.  

అద్భుతం సినిమాతో ఈ బ్యూటీ హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది. అంత‌కు ముందు  పెళ్లిసంద‌డి సినిమాలో న‌టించింది.  కానీ ఇవేవి పెద్ద‌గా ఆడ‌క‌పోయే స‌రికి శివానీ రీచ్ అవ్వ‌డం క‌ష్ట‌మైంది.  అలాగే త‌మిళ్ లోనూ రెండు సినిమాలు చేసింది.  ప్ర‌స్తుతం `ఆహా నా పెళ్లంట` అనే సినిమాలో న‌టిస్తోంది. ఇందులో రాజ్ త‌రుణ్ కి  జోడీగా న‌టించింది.  త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా అన్ని మీడియా సంస్థ‌ల్నిచుట్టేస్తుంది. న‌టిగా త‌న‌ని తాను వ్య‌క్తిగ‌తంగా ప్ర‌మోట్ చేసుకుంటుంది. రాజ‌శేఖ‌ర్.. జీవిత‌ల స‌హ‌కారం ఉన్న‌ప్ప‌టికీ  వాళ్ల‌ని పెద్ద‌గా హైలైట్ చేయ‌డం లేదు. ప‌ర్స‌న‌ల్ గా తానేంటో అంద‌రికీ తెలియాలి అన్న ఓ స్ర్టాట‌జీ క‌నిపిస్తుంది. సినిమాల్లోకి రాక‌ముందు అమ్మ‌డు బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్ సినిమాల‌కు ప‌నిచేయాలి అనే ఆస‌క్తిని  వ్యక్త ప‌రించింది. మ‌రి ఆర‌క‌మైన ప్ర‌య‌త్నాలు ఏవైనా చేస్తుందా? అన్న‌ది తెలియాలి.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News