గతేడాది నేచురల్ స్టార్ నాని హీరోగా విడుదలైన 'జెర్సీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి కాస్త డేరింగ్ ఎక్కువేనట. షూటింగ్ సెట్ లో కూడా డేరింగ్ గా ఉంటుందట. ఇటీవలే అమ్మడి రెండో తెలుగు సినిమా 'కృష్ణ అండ్ హిస్ లీల" విడుదలైంది. అది కూడా థియేటర్లో కాదు.. నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో. క్షణం ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను టాలీవుడ్ టాల్ హీరో రానా నిర్మించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రద్ధ కింద పడిందట. అది కూడా రాయల్ ఎంఫిల్డ్ బైక్ పై నుండి పడిందట. అయితే ఆ ఇన్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఆ వీడియోను తానే తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రద్ద. "2017 జూన్ నెలలో హైదరాబాద్ లోని నందిహిల్స్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు.. తాను బుల్లెట్ నడుపుతూ క్రింద పడిన విషయాన్ని చెబుతూ ఆ సమయంలో డైరెక్టర్‌కి, తనకు మధ్య జరిగిన సంభాషణను వివరించింది అమ్మడు. శ్రద్ధ వివరిస్తూ.. ''క్రిష్ణ అండ్ హిజ్ లీల షూటింగ్‌లో భాగంగా నేను బైక్ నడిపే సన్నివేశం ఉంది. అందుకోసం డైరక్టర్ రవికాంత్.. నా దగ్గరికి వచ్చి బైక్ నడపగలవా? అన్నారు. రాజీపడటం ఇష్టంలేక దానికి నేను రాదు కానీ ట్రై చేస్తా.. అని చెప్పి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎక్కేశాను.
అందుకు కారణం నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు బైక్ నడిపిన అనుభవం ఉండటమే. అయితే ఆ రోజు ఆ ప్రాంతమంతా తడిగా ఉంది. దీంతో అలా బైక్ ఎక్కి టర్న్ చేశానో లేదో.. బ్యాలన్స్ తప్పి క్రింద పడిపోయా. ఆ ఘటనను మొత్తం నా అసిస్టెంట్ ప్రశాంత్ సరదాగా వీడియో తీశాడు. అలా నేను క్రిందపడగానే సెట్లో ఉన్నవాళ్లంతా నాకేమైందోనని కంగారు పడ్డారు. నాకేమీ కాలేదు కానీ బైక్ కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. అయినా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు ఎందుకు అంత బరువుగా ఉంటుందో.." అంటూ వీడియోకి సంబంధించి వివరించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.