న‌ట‌వార‌సులు ఛాన్సులు లాక్కున్నారు!

Update: 2019-06-11 05:02 GMT
అందాల తాప్సీ ప‌న్ను ప్ర‌స్తుతం గేమ్ ఓవ‌ర్ ప్ర‌మోష‌న్స్ లో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త‌మిళ్- తెలుగు స‌హా బ‌హుభాష‌ల్లో ఈ చిత్రం రిలీజ‌వుతోంది. జూన్ 14 రిలీజ్ తేదీ. ఆ క్ర‌మంలోనే తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ కోసం చెన్న‌య్ టు హైద‌రాబాద్ హడావుడిగా తిరిగేస్తోంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ సినిమాలో తాప్సీ పాత్ర ఆస‌క్తిక‌రం. ఓ ప్ర‌త్యేక‌మైన‌ డిజార్డ‌ర్ తో బాధ‌ప‌డుతూ ... వీల్ ఛైర్ కి అంకిత‌మ‌య్యే అమ్మాయిగా పూర్తిగా కొత్త‌ద‌నం నిండిన పాత్ర‌తో మైమ‌రిపించ‌బోతోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక తాప్సీ అటు బాలీవుడ్ స‌హా సౌత్ లోనూ పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ త‌ర‌హా పాత్ర‌ల్నే ఎంచుకుంటోంది. భాష ఏదైనా సినిమా ఆద్యంతం త‌న భుజాలపైనే ర‌న్ అవ్వాలి. అంత పెద్ద‌ భారం ఎలా మ్యానేజ్ చేయ‌గ‌లుగుతున్నారు? అన్న ప్ర‌శ్నకు తాప్సీ ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు.  హైద‌రాబాద్ ఇంట‌ర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. ఆ త‌ర‌హా క‌థలే త‌న‌వైపు వ‌చ్చాయి కాబ‌ట్టి క‌చ్ఛితంగా త‌నే ఆ బాధ్య‌త‌ను తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ``నా డైరెక్ట‌ర్స్ అంతా ఎంతో తెలివైన‌వాళ్లు. నా దృష్టిలో వాళ్లే హీరోలు. స్క్రిప్టు చ‌దివేప్పుడు.. సెట్స్ లో ఉన్న‌ప్పుడు నేనెప్పుడూ సోలో హీరోయిన్ ని అని ఒత్తిడిగా ఫీల‌వ్వ‌లేదు. తొలి పోస్టర్ ప‌డినప్పుడు `తాప్సీ గేమ్ ఓవర్` అంటూ ప్ర‌చారం సాగించారు. దానివ‌ల్ల కొంత ఒత్తిడి ఫీల‌య్యాను. గ‌తంలో ఎప్పుడూ నా పేరు పోస్టర్ లో వేయ‌లేదు. హిందీలో `నామ్ షబానా` అనే టైటిల్ రోల్ చేసినా కూడా అక్కడ పోస్టర్ లో పేరు వేయలేదు.  ఈసారి మాత్రం పోస్ట‌ర్ లో నా పేరు వేసి భ‌య‌పెట్టేశారు`` అని తెలిపారు.

సినిమా సంగ‌తుల‌తో పాటు  పెళ్లి గురించి .. నెప్టోయిజం గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు తాప్సీ ఆస‌క్తిక‌ర స‌మాధానాలిచ్చారు. పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేదా? అన్న ప్ర‌శ్న‌కు. ``ఫ్యామిలీ- కిడ్స్ తో ఎంజాయ్ చేయాల‌ని అనుకున్న‌ప్పుడు మాత్ర‌మే పెళ్లాడ‌తాను. ఇప్ప‌టికి ఆ ఆలోచ‌న లేదు`` అని తెలిపారు. న‌ట‌వార‌సుల వెల్లువ వ‌ల్ల ఇబ్బందులేవైనా ఎదుర్కొన్నారా? అన్న ప్ర‌శ్న‌కు.. ``అవును. కొన్ని ఆఫ‌ర్లు కోల్పోయాను. ఆ టైమ్ లో ఏడ్వాల‌నిపించింది. కానీ దానివ‌ల్ల‌నే ప్ర‌శాంత‌త‌ దొరికిందని భావిస్తున్నా`` అని స‌మాధానమిచ్చారు తాప్సీ.

అస‌లు ఈ పురుషాధిక్య ప్ర‌పంచంలో నెగ్గుకు రావ‌డం క‌ష్టం అనిపించ‌లేదా ఏనాడూ? అని ప్ర‌శ్నిస్తే.. తాప్సీ షాకిచ్చే ఆన్స‌ర్ ఇచ్చారు. ``పురుషాధిక్య‌త అనేది ఒక చ‌ట్టం లాంటిది ఇక్క‌డ‌. మ‌నం దానిని అంగీక‌రించి తీరాల్సిందే. అదంతే అని నాకు తెలుసు. ఆ దారిలోనే జీవించాలి.. నా వ‌ర‌కూ దాంతో ఇబ్బందేం లేదు`` అంటూ క‌ఠోర‌మైన స‌త్యాన్ని న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పింది తాప్సీ. సౌత్ లో ఏ సినిమాలు చేస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు.. గేమ్ ఓవ‌ర్ త‌ర్వాత త‌మిళంలో ఓ సినిమా చేస్తున్నా. తెలుగులో రెండు స్క్రిప్టులు విన్నాను. కానీ ఇంకా నిర్ణ‌యించుకోలేదు.. అని తెలిపారు. ఇక సౌత్ లో న‌టీమ‌ణుల్ని దేవ‌త‌లుగా చూస్తారు. కానీ హిందీ ప‌రిశ్ర‌మ‌లో అదో క్యాజువ‌ల్ డ్యూటీలా చూస్తారు అంతే! అంటూ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేశారు తాప్సీ.

    
    
    

Tags:    

Similar News