మనిషన్నాక..కూసింత కళాపోషణ ఉండాలోయ్ అన్నట్లు...మనిషి అన్న వాడికి ఎవరికైనా ఈగో కూడా కూసింత ఉండాలోయ్. మరీ ఇగో లోకపోతై ఎదుట వాళ్లకి లోకువైపోం అన్న నానుడి ఉన్నదే. అలాగని ఈగో తోనే బ్రతుకుతాను? అంటే అంతకన్నా పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుందన్నది గ్రహించాలి. సరిగ్గా ఇదే ప్రమాదంలో ఉంది సొట్టబుగ్గల తాప్సీ.
అవును ఈ బ్యూటీకి ఈగో గ్రాముల్లో కాదు.. కిల్లోలోనూ కాదు..ఏకంగా టన్నుల్లోనే ఉందిట. ఇగోకి పోయిందంటే? ఎంత దూరమైనా వెళ్తుందిట. అంతు చూసే వరకూ వదిలి పెట్టదంట. కానీ తనలో ఆ ఇగోని పొగొట్టేది మాత్రం తన మనసుకు నచ్చిన కథ అంటోంది. అలాంటి కథ ఏ దర్శకుడైనా చెప్పగలిగితే ఆ దర్శకుడికి పొర్లుదండాలు కూడా పెట్టేస్తుందిట.
అలాంటి సమయంలో తన మనసులోకి ఇగో భావన రాదుట. పూర్తిగా దర్శకుల హీరోయిన్ గా మారిపోతుందిట. పాత్ర ఎలా ఉంటుంది? బడ్జెట్ ఎంత? బ్యానర్ ఏంటి ? వంటి అంశాలు అస్సలు ఆలోచించదట. తన కెరీర్ గురించి ఎవరెలాంటి విమర్శలు చేసినా లైట్ తీసుకుంటుందిట ఆ సమయంలో. ఒక మంచి సినిమా చేయాలన్న ఉద్దేశం తప్ప ఇంకెలాంటివి తన కంటికి కనిపించవట ఆ సందర్భంలో.
అలాగే తనకున్న ఈగో ని తనదైన శైలిలో సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. కెరీర్ ఎవరికీ పూల దారి కాదని.. ఎవరైనా తప్పొప్పులు చేస్తారని..ఏ పనిచేసినా నూరుశాతం ఎవరిని తృప్తి పరచలేమని... అలాంటి సమయాల్లో వచ్చిన ప్రతీ విమర్శ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని..అందులోనూ ఇగోయిస్టిక్ అంటే అస్సలు పట్టించుకోనని కుండబద్దలు కొట్టేసింది.
మొత్తానికి తాప్పీ లోచాలా యాంగిల్స్ ఉన్నాయినని తెలుస్తోంది. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది. తనలో డేరింగ్ నెస్ గురించి ఇప్పటికే రివీల్ చేసింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లా మాటలు తుటాల్లా పేల్చగల సమర్ధురాలని పలు సందర్భాల్లోనూ రుజువు చేసింది. ఆ రకంగా బాలీవుడ్ లో నవ నాయికలకు రోల్ మోడల్ గానూ నిలుస్తోంది.