భారతదేశపు అత్యుత్తమ నటీమణులలో త్రిష ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అద్భుత నటప్రదర్శనలతో ఆకట్టుకుంది. తెలుగు- తమిళ చిత్రాలలో త్రిష నటించింది. బాలీవుడ్ లోనూ లక్ చెక్ చేసుకుంది. తెలుగు ఆడియెన్ లో వర్షం- నువ్వొస్తానంటే నేనొద్దంటానా? లాంటి చిత్రాలతో త్రిష ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది.
అయితే వ్యక్తిగత జీవితంలో త్రిష కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. అప్పట్లోనే ఈ బ్యూటీ ఓ యువ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని ప్రచారమైంది. కానీ ఆ ప్రేమ బ్రేకప్ అయ్యింది. ప్రముఖ బిజినెస్ మేన్ తో గతంలో త్రిష నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లికి ముందే నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత త్రిష కు శింబుతో పెళ్లి జరగనుందని కూడా ప్రచారం సాగిపోయింది. అది కూడా నిజం కాలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్థావన తెస్తూ తనను ఎలా ఇర్రిటేట్ చేస్తున్నారో త్రిష ఆవేదనగా చెప్పుకొచ్చింది. నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రజలు నన్ను తరచుగా అడుగుతారు. ఇప్పటికే వయసైంది.. ఈపాటికే నాకు పెళ్లి జరగాల్సి ఉందని అంటున్నారు. వారు అడిగే విధానం నాకు నచ్చలేదు. మీరు సాధారణంగా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అడిగితే మీకు సమాధానం వస్తుంది... అని అంది. ``అంటే... నాకు తెలియదు. ఇది పూర్తిగా నేను ఎవరితో ఉన్నాను. నేను ఎవరిని కలుస్తాను? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నా జీవితాంతం కలిసి జీవించగలిగే వ్యక్తి ఇతనే అని నేను భావించాలి. అతడినే ఎన్నుకుంటాను`` అని వరుడి లక్షణాలపైనా క్లూ ఇచ్చింది.
అంతేకాదు ఇరుగు పొరుగుపైనా క్లాస్ తీస్కుంది. ``నాకు విడాకుల మీద నమ్మకం లేదు. పెళ్లయ్యాక విడాకులు తీసుకోవాలనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్న అనేక మంది వివాహిత జంటలు తమ వివాహం పట్ల అసంతృప్తిగా ఉన్నారని నాకు తెలుసు. వీరిలో కొందరు నా స్నేహితులు కూడా ఉన్నారు. చాలా తప్పుడు కారణాల వల్ల వారు అసంతృప్తిగా ఉన్నారు. నేను అలాంటి పెళ్లిలో ఉండాలనుకోలేదు`` అని త్రిష పేర్కొంది. దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ -1 లో త్రిష రాకుమారి పాత్రలో అలరించింది. తనదైన క్యూట్ నెస్ అద్భుత నట ప్రదర్శనతో మనసులు దొంగిలించింది.
పెటా సభ్యురాలి ఆసక్తికర పాత్ర
మూగ జీవాలపై పెటా కార్యకర్తగా త్రిష ప్రేమాఆప్యాయతల గురించి చెప్పాల్సిన పని లేదు. కథానాయికగా కెరీర్ జర్నీలో బిజీగా ఉన్నా త్రిష తనవంతు బాధ్యతగా పెటాకు వర్క్ చేశారు. బ్లూక్రాస్ మెంబర్ గా మూగ జీవాల పట్ల ఎంతో కరుణ ప్రేమను కనబరుస్తుంటారు. ఇంతకుముందు చెన్నై వీధుల్లో గాయపడిన ఓ కుక్క విషయంలో త్రిష చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అది ఎవరి వల్ల గాయపడిందో రాష్ డ్రైవింగ్ చేసినదెవరో కనిపెట్టేవరకూ పోలీసులను విడిచిపెట్టలేదు.
ఇటీవల వీధి కుక్కల రక్షణ కోసం ప్రత్యేక ఉద్యమం చేపట్టింది త్రిష. అంతేకాదు వీధి కుక్కల సంరక్షణ నేపథ్యంలో బృంద అనే పోలీస్ అధికారిగా ఓ మూవీలో నటిస్తోంది. అంటే కర్కశమైన పోలీస్ అధికారిగా ఈ మూవీలో కనిపించనుందిట.