సెలబ్రెటీలను అంతా కూడా ఆదర్శంగా తీసుకుంటారు. వారిని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ వారి అలవాట్లను వారి కట్టుబొట్టును పాటించేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా యూత్ లో ఎక్కువ శాతం మంది స్టార్స్ ను విపరీతంగా ఫాలో అవుతూ ఉంటారు. అందుకే సెలబ్రెటీలు మాట్లాడేప్పుడు.. సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ చిన్న తప్పు మాట్లాడినా ఏ చిన్న తప్పు దొర్లినా కూడా నెటిజన్స్ ఆట ఆడేసుకుంటారు.
తాజాగా మాలీవుడ్ హీరోయిన్ వీనా నందకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బీర్ తాగే అలవాటు ఉందని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగితే మనం దీని గురించి పెద్దగా చర్చించుకునేవాళ్లం కాదు. కాని ఆమె మరింత డెప్త్ గా వ్యాఖ్యలు చేసింది. ఈమద్య కాలంలో అమ్మాయిలు బీర్లు తాగడం చాలా కామన్ అయ్యింది. దాన్ని నేను చెప్పుకోవడానికి ఎందుకు భయపడాలి. నేను ఇష్టంగా బీర్ తాగుతాను కాబట్టి అందరికి చెబుతున్నాను అంది.
నేను బీర్ తాగడం వల్ల మరెవ్వరికో నష్టం లేదు కనుక నన్ను ఎవరు విమర్శించే హక్కు లేదు. నేను నా వ్యక్తిగత అవసరం కోసం తాగుతున్నాను కనుక ఎవరు కూడా నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వీనా నందకుమార్ బీర్ అవాటుపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆడవారు తాగడం అనేది మన సాంప్రదాయం కాదు. సరే తాగారే అనుకోండి మీరు ఇంటర్వ్యూలో అంత ఓపెన్ గా నా ఇష్టం నేను తాగుతాను.. తాగితే మంచిదే అన్నట్లుగా మీరు ఎందుకు మాట్లాడాలి అంటూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి బరితెగింపు మాటలు కెరీర్ కు నష్టం కలిగిస్తాయంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.