పుట్టుమచ్చ కొందరికి అందం పెంచుతుంది. అది ఉన్న స్థానాన్ని బట్టి ఆ అందం డబుల్ ట్రిపుల్ కూడా అవుతుంది. సెక్సప్పీల్ ని కూడా పెంచుతుంది. అందాల నయనతారకు పెదవి పై అంచున ఉన్న పుట్టుమచ్చ సంథింగ్ స్పెషల్ అని అభిమానులు చెబుతుంటారు.
సీనియర్ నటి రేఖ- అలియా భట్ - కియారా అద్వానీ -అనుష్క శర్మ- నీతి టేలర్ ఇలా భామల అందాన్ని పుట్టుమచ్చలు ప్రత్యేకంగా ఇనుమడింపజేశాయని అభిమానులు చెబుతుంటారు. బయటికి కనిపించే పుట్టుమచ్చల వెనక చాలా అర్థం ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. నిజానికి జ్యోతిష్కుల ప్రకారం దాని అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆసక్తికర విషయాలే తెలిసాయి.
సీనియర్ నటి రేఖ - అందమైన పుట్టుమచ్చ వెనక స్టోరి...!
ఎవర్ గ్రీన్ నటి రేఖ తన పై పెదవికి పైన ఉన్న పుట్టుమచ్చతో ఎంతో ఆకర్షణ ఉన్న నటిగా పాపులరైంది. అయితే ఈ పుట్టుమచ్చ ఒరిజినల్ కాదన్న సంగతి ఎందరికి తెలుసు? ఇది కృత్రిమమైనదని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే అందాల మచ్చలు ఉన్న బాలీవుడ్ నటీమణులు చాలా మంది ఉన్నారు. ఈ మచ్చలు ఆస్ట్రాలజీ ప్రకారం దేనిని సూచిస్తాయి? అన్నది కూడా ఆసక్తికరం.
కియారా అద్వానీ
కియారా అద్వానీకి గడ్డం ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంది. జ్యోతిష్యం ప్రకారం... ఎడమ వైపున ఉన్న పుట్టుమచ్చ అతను/ఆమె పూర్తిగా నిజాయితీతో ఉంటుందని ఇండికేషన్. అలాగే మొద్దుబారిన వ్యక్తిత్వం వారిది అని సూచిస్తుంది.
అలియా భట్
ఆర్.ఆర్.ఆర్ లో సీతగా నటించి మెప్పించిన అలియా భట్ కి తన నుదిటికి కుడి వైపున కనిపించే బ్యూటీ స్పాట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె అందమైన వ్యక్తిని వివాహం చేసుకుంటుందని ఈ మచ్చ సూచిస్తుందనేది జోస్యం. తాను కోరుకున్న అందగాడినే ఆలియా పెళ్లాడింది.
అనుష్క శర్మ
అనుష్క శర్మకు కూడా ఆమె గడ్డం మీద దాదాపు దవడ పై పుట్టుమచ్చ ఉంది. దీని అర్థం.. ఆప్యాయతలో కొండంత.. శ్రద్ధగా ఉండటంలో ఆకాశం ఎత్తున ఉంటారని ...ఇది సూచిస్తుంది. అనుష్క శర్మ నటిగా నిర్మాతగా కూడా ఫెయిల్ కాకపోవడానికి ఆ రెండూ ప్రధాన కారణాలు. వ్యక్తిగత జీవితంలోను తాను కోరుకున్న క్రికెటర్ ప్రియుడు విరాట్ ని కొంగున కట్టేసుకుందంటే అనుష్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి.
శ్రద్ధా కపూర్
శ్రద్ధా కపూర్ తన కింది పెదవి దిగువన అందమైన స్పాట్ ని కలిగి ఉంది. పెదవి కింద పుట్టుమచ్చ ఉన్నవారికి థియేటర్ రంగంపై అమితాసక్తి ఉంటుందని జ్యోతిష్యం సూచిస్తుంది. ఆషిఖి 2 -ఏక్ విలన్- సాహో చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను శ్రద్ధా కొల్లగొట్టింది. నటిగా తనను తాను నిరూపించుకుంది.
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ పెదవి పైన పుట్టుమచ్చతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ప్రకృతితో మమేకమయ్యే వ్యక్తిత్వాన్ని.. ఆహార ప్రియత్వాన్ని సూచిస్తుంది. జీవితంలో అత్యుత్తమమైన వాటిని సాధించేందుకు కూడా ప్రయత్నాలు సాగుతాయని ఈ మచ్చ చెబుతుంది.
నయనతార
నయనతార పుట్టుమచ్చ నిజానికి ఆమె అందానికి USP. ఆ దోర దొండ పెదవుల పైన మధ్యలో ఒక పుట్టుమచ్చ ఎంతో మనోహరంగా ఉంటుంది. ఇది నాయకురాలు కాబోయే లక్షణం. తలైవి అన్న పిలుపు కూడా అందుకే నయన్ కి యూనిక్ గా దక్కింది. ప్రజలచే ఆమోదించబడిన గొప్ప వ్యక్తిత్వం అని ఈ పుట్టుమచ్చ సూచిస్తుంది. ప్రస్తుతం సినీకెరీర్ లో బిజీగా ఉన్న నయనతార భవిష్యత్ లో నాయకురాలు అవుతుందేమో చూడాలి. ఇటీవలే విఘ్నేష్ తో సరోగసీలో నయన్ బిడ్డను కన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.