చేప‌లు మాంసం తింటే విషం తిన్న‌ట్టేన‌న్న పెటా ప్ర‌చార‌క‌ర్త‌ అదా!

Update: 2021-05-13 05:30 GMT
అందాల క‌థానాయిక‌లు పెటా త‌రపున ప్ర‌చారం చేస్తే అది అభిమానుల‌కు ఇట్టే క‌నెక్ట‌యిపోతుంది. ఇప్పుడు హార్ట్ ఎటాక్ బ్యూటీ అదాశ‌ర్మ ఈ త‌ర‌హా ప్ర‌చారానికి రెడీ అయ్యింది. తాజాగా పెటా బ్రాండ్ అంబాసిడ‌ర్ అవ‌తార‌మెత్తిన అదా మ‌త్స్య‌క‌న్య గెట‌ప్ వైర‌ల్ గా మారింది. అదా మంత్రముగ్ధమైన మత్స్యకన్య రూపాన్ని స్టైల్ క్రాకర్ డాట్ కామ్ రూపొందించింది. త‌న‌ హెయిర్ అండ్ మేకప్ స్టైలింగ్ ని అయేషా వడివాలా రూపొందించారు. పరిశ్రమ-ప్రముఖ ఫోటోగ్రాఫర్ గౌరవ్ సాన్ అదా ఆకర్షణీయమైన ప్రకటనను చిత్రీకరించారు.

ఇక పెటా ప్ర‌చార‌క‌ర్త‌ అదాశ‌ర్మ నాన్ వెజ్ ప్రియుల‌కు ఓ రేంజులోనే క్లాస్ తీస్కుంది. జ‌ల‌చ‌రాలు అయిన చేప‌ల్ని .. భూచ‌రాలు అయిన జంతువుల్ని తిన‌డం ప్రాణాపాయానికి దారి తీస్తుంద‌ని చెబుతోంది. చేప‌లు మాంసం విషంతో స‌మాన‌మ‌ని ప్ర‌చారం చేస్తోంది.

మ‌నిషి శాకాహారం తిన‌డం మంచిది. దానివ‌ల్ల‌ జంతువులకు వాటి ఆరోగ్యానికి మంచిది. జీవితకాల శాఖాహారిగా ఉండండి. పండ్లు- చిక్కుళ్ళు కూరగాయలు విటమిన్లు ఖనిజాలు ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉన్నాయి. అన్నిర‌కాల‌ కొలెస్ట్రాల్ (కొవ్వు) కార‌కం అయిన‌  మాంసంలో లభించే కలుషితాలు ఆరోగ్యానికి హానిక‌రం.. అని పెటా త‌ర‌పున అదా ప్ర‌చారం చేస్తున్నారు.

``శాఖాహారం మిమ్మల్ని నిజంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ కండరాలు.. మీ ఎముకలను ధృఢంగా ఉంచుతుంది. ఇది మీకు చాలా శక్తిని ఇస్తుంది. శాఖాహారం తినడం వ‌ల్ల మెరిసే చర్మం- చక్కని మందపాటి జుట్టు లభిస్తుంది. మీరు ఇతర ప్రాణులను చంపడం లేదు కాబట్టి ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది`` అని అదా తెలిపారు.

ఆహారం కోసం సంహ‌రిస్తున్న‌ చేపలు సాధారణంగా ఊపిరి పీల్చుకునే జీవులు. ఇవి శిలువ వేయబడతాయి... చూర్ణం చేయబడతాయి.. తొలగించబడతాయి - ఇవన్నీ పూర్తిగా బ‌తికి ఉండ‌గానే.. ఇది దారుణం. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. తాబేళ్లు- డాల్ఫిన్లు .. ఇతర జలజీవులు తరచుగా ఇతర జాతుల కోసం ఉద్దేశించిన ఫిషింగ్ నెట్స్ లో చిక్కుకుంటాయి. దీనివల్ల‌ వాటి ఊపిరి ఆడకుండా వదిలేస్తే.. గాయపడిన వాటి మృతదేహాలను తరచుగా నీటి ఒడ్డుకు విసిరేసి రక్తస్రావం అవ్వ‌టానికి లేదా వేటాడే జంతువులకు తినడానికి వదిలేస్తారు. ఇది అమానుషం.. అని అదా అన్నారు.

``చేపలు నొప్పిని ఫీల‌వుతాయని అధ్యయనాలు కనుగొన్నాయి. చేపలు తమ మాంసంలోకి పీల్చుకునే టాక్సిన్స్ అవి నివసించే నీటి కంటే 9 మిలియన్ రెట్లు అధికంగా కేంద్రీకృతమై ఉంటాయి. కాబట్టి చేపల మాంసాన్ని తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. నేను చాలా చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను. మీరు ఈ రోజు తినేది రేపు ఆరోగ్యం పాడు చేస్తుంది`` అని అదా చెప్పారు.

మీరు చేపలు లేదా ఇతర జంతువులకు సహాయం చేయవచ్చు. మాంసాన్ని విడిచిపెడితే మీ ఆరోగ్యం మెరుగవుతుంది. పెటా నుండి ఉచిత శాఖాహారం .. వేగన్ స్టార్టర్ కిట్ ను ఆర్డర్ చేయ‌డం ప్రారంభించండి. పోషకాహార సమాచారం తెలుసుకోండి. పరివర్తన - రుచికరమైన వంటకాలను తయారుచేసే చిట్కాలు తెలుస్తాయి. మాంసం తినకూడదనే మీ నిర్ణయం ఇతరులకు ఎలా ఉపయోగపడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ప‌రిశోధించండి అని తెలిపారు.Full View
Tags:    

Similar News