ఫోటోటాక్: చైనా భామ‌లా ఆ తిప్పుడు ఏంటి అమ్మ‌డు

Update: 2022-04-25 03:30 GMT
చైనీస్ భామ‌ల క‌త్తు సాముల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌త్తుల్ని క‌ర్ర‌ల్లా తిప్పి ప్ర‌త్య‌ర్ధుల్ని హ‌త‌మార్చ‌గ‌లల నేర్ప‌రి త‌న్నాని చైనా భామ‌ల్లోనే చూడ‌గ‌లం. ఒళ్లు గ‌గుర్లు పొడిచే క‌త్తి ఫైట్ల‌లో చైనీస్ హీరోయిన్లు ఆద్యంతం ఆక‌ట్టుకుంటారు. చైనా  భామ‌లు క‌త్తి ప‌ట్టి ఫైట్ చేస్తున్నారంటే ఆడ‌మ‌గ అనే  తేడా లేకుండా వార్ కొన‌సాగుతుంది. అంత‌గా క‌త్తుసాములో నేర్ప‌రిత‌నం చైనా భామ‌ల సొంతం.

తాజాగా  ఓ తెలుగు హీరోయిన్ ఆద్యంతం క‌త్తు సాములో కాదుగానీ..ఆహార్యంలో చైనా భామ‌నే త‌ల‌పిస్తుంది. ఇదిగో ఒక్క‌డిలాత‌ల్వార్ మాదిరి  క‌త్తి ప‌ట్టుకుని ఆదాశ‌ర్మ కెమెరాకి ఫోజులిచ్చింది. వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుక‌నిపిస్తుంది. ఇక ఆహార్యంలో అయితే అచ్చంగా చైనా భామ‌నే దించేసింది. పూర్తిగా చైనీస్ లేడీ హెయిర్ స్టైల్ ని పోలి ఉంది. ఈ ఫోటో ఇన్ స్టా లో వైర‌ల్ గా మారింది. ఆదాశ‌ర్మ‌ ఇన్ స్టాలో మంచి ఫాలోవ‌ర్స్ ని క‌ల్గి ఉంది. అభిమానుల కామెంట్ల‌కు హ‌ద్దు లేదు.

ఇలాంటి ఫోజులు ఆదాకి కొత్తేం కాదు గ‌తంలో  ఇంస్టాలో నాంచాక్ తిప్పుతూ దర్శనమిచ్చింది. అమ్మడు  సముద్రతీరంలో వైట్ అండ్ వైట్ కరాటే డ్రెస్ ధరించి నాంచాక్ తిప్పింది. ఆ పోస్ట్ చూసి నేటిజన్లు ఈ సొగసరి నాంచాక్ తిప్పడం కూడా అందంగానే ఉందంటూ కామెంట్స్ చేసారు. ఇక గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ లోనూ ఆదాశ‌ర్మ ఏమాత్రం త‌గ్గ‌దు. ఎప్పటికప్పుడు ఇన్ స్టాని అందాలతో హీటెక్కిస్తుంది. అప్పుడ‌ప్పుడు ఇలా రొటీన్ కి భిన్నంగా కొత్త‌గా  ట్రై చేస్తుంటుంది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే `హార్ట్ ఎటాక్` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అటుపై కొన్ని సినిమాల్లో న‌టించింది. అడవిశేష్ తో `క్షణం` అల్లు అర్జున్ తో `సన్నాఫ్ సత్యమూర్తి` లాంటి హిట్ చిత్రాలలో నటించింది. ఆ సినిమాలు హిట్టు కొట్టినా ఆదాకు మాత్రం క్రెడిట్ దక్కలేదు. ఆదా చివరిగా కనిపించిన తెలుగు సినిమా `కల్కి`. ఈ సినిమాలో ఓ డాక్టర్ పాత్ర చేసింది. అంతే మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో `బైపాస్ రోడ్`..`క‌మోండో` చిత్రాల్లో న‌టించింది. 
Tags:    

Similar News