ప‌చ్చ‌ని పొద‌లో ఆకులా మారిన అదా!

Update: 2022-07-17 07:30 GMT
ప్ర‌కృతి జీవ‌నం మ‌రిచిపోవ‌డం వ‌ల్ల మ‌నిషి మ‌నుగ‌డ అంత‌కంత‌కు కాంప్లికేటెడ్ గా మారుతోంది. అయితే ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తించేదెలా? అందుకే అప్పుడ‌ప్పుడు సెల‌బ్రిటీలు నేచుర్ కాన్సెప్ట్ తో ఫోటోషూట్లు చేసి అవేర్ నెస్ పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత‌కుముందు పెటాతో క‌లిసి ప‌లువురు క‌థానాయిక‌లు ప్ర‌కృతి జీవ‌నంపై బోలెడంత ప్ర‌చారం చేసారు. ఈ జాబితాలోనే అదాశ‌ర్మ కూడా ప్ర‌కృతి జీవ‌నం వెజిటేరియ‌న్ లైఫ్ స్టైల్ గురించి బోలెడంత ప్ర‌చారం చేసింది.

తాజాగా అదా శర్మ మ‌రోసారి ప్ర‌యోగాత్మ‌క లుక్ తో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈసారి కూడా ప్ర‌కృతితో మ‌మైకం అవ్వ‌డ‌మెలా? అన్న కాన్సెప్టును ఎంచుకుంది. ఆకులతో చేసిన దుస్తులను ధరించిన అదా శ‌ర్మ ఎంతో నేచురల్ గానూ క‌నిపించింది. ప్రకృతిని ఇనుమ‌డించే దుస్తులతో అదా తన ఫాలోవ‌ర్స్ ని ఆశ్చర్యపరిచింది. ప్రకృతి - నా ఫ్యాషన్ స్ఫూర్తి అని ఈ ఫోటోల‌కు అదా క్యాప్ష‌న్ ఇచ్చింది. ``ప్రకృతిలో ఏదీ పరిపూర్ణంగా లేదు.. అయితే ప్రతిదీ ఇక్క‌డ ఉంది. పుష్కలంగా నీరు త్రాగండి. ఎల్లప్పుడూ మీ మూలాలను గుర్తుంచుకోండి`` అని ఈ ఫోటోకి అదా వ్యాఖ్య‌ను జోడించింది.

అదా శ‌ర్మ‌ పోస్ట్ కు నెటిజనుల నుంచి అద్భుత స్పంద‌న‌లు వ‌చ్చాయి. ప‌లువురు ఎగ్జ‌యిట్ చేసే వ్యాఖ్యలతో ప్రతిస్పందించారు. ప్ర‌కృతిలో మమేక‌మైన‌ అదాకి ఫిదా అవ్వ‌నిదెవ‌రు? అని ఒక అభిమాని వ్యాఖ్యానించ‌గా.. నేచుర్ తో జీవించ‌డ‌మెలానో అదాని చూసి నేర్వాలి అని ఓ అభిమాని స్పందించారు. అదా అనే తీగ‌ను అల్లుకుపోయిన ఆకులు అంటూ మ‌రొక‌రు జోష్ ప్ర‌ద‌ర్శించారు. ప‌చ్చ‌ని పొద‌లో ఆకులా మారిన అదా! చాలా హాట్ గా కనిపిస్తున్నారు.. అని ఒక నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా.. ‘లుకింగ్ సో సెక్సీ’ అంటూ మరొక‌రు.. ‘పట్టే పట్టే’ అని వేరొక అభిమాని వ్యాఖ్యానించారు. అదాశ‌ర్మ తాజా ఫోటోషూట్ లో ఓ ఫోటోగ్రాఫ్ విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఈ ఫోటోలో కూర‌గాయ‌లు అమ్మే యువ‌తిగా అదా పూర్తి డీగ్లామ‌ర‌స్ లుక్ లో క‌నిపించింది.

తెలుగులో కెరీర్ నిల్

అదా శ‌ర్మ టాలీవుడ్ కెరీర్ ప్ర‌స్తుతానికి ఏమంత జోష్ తో లేదు! రాజ‌శేఖ‌ర్ `క‌ల్కి` చిత్రంలో చివ‌రిసారిగా క‌నిపించింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో `ప‌తి పత్ని ఔర్ పంగ` అనే చిత్రంలో న‌టించింది. మామ్స్ అండ‌ర్ స్టాండ్ బెస్ట్ అనే ల‌ఘు చిత్రంతోనూ అదా యూట్యూబ్ లో వైర‌ల్ అయ్యింది. `క్వ‌శ్చ‌న్ మార్క్‌` అనే చిత్రంలో న‌టిస్తోంద‌ని ప్ర‌చార‌మైనా దానికి సంబంధించి అప్ డేట్ లేదు. సోల్ స‌తి అనే చిత్రంలోనూ అదా న‌టిస్తోంది. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఈ మూవీ చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. అయితే సినిమాల‌తో సంబంధం లేకుండా సోష‌ల్ మీడియాలో వ‌రుస ఫొటోషూట్ల‌తో అదాశ‌ర్మ ట్రీటిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News