ఫోటో స్టోరీ: అదా.. అస్సలు ఆగదు కదా!

Update: 2020-05-27 02:30 GMT
అందరిలాగే తను కూడా ఉంటే ప్రత్యేకత ఏముందని అనుకుందో కాని అదా ఎప్పుడూ ఏదో ఒక డిఫరెంట్ ఫోటోలతో వింత అప్డేట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈమధ్య వింత నమస్కారం పెట్టి ఆకర్షించిన అదా తాజాగా విండో దగ్గర వయ్యారి పోజులిచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

అదా శర్మ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓ నాలుగు ఫోటోలు పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలకు "వెన్నులో వణుకు.. ఎక్కువ వణుకు రావాలంటే స్వైప్ చెయ్యండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఓ కిటికీ దగ్గర వీలైనంతగా అందాలను వడ్డిస్తూ నిలుచుంది. ఒక్కో ఫోటో ఒక్కో కోణం.. అదాలోని అన్ని కొంటె కోణంగి కోణాలు కలిపితే ఎవరికైనా గణితం ఇట్టే అర్థం అవుతుంది. అయితే ఇది సాధారణ గణితం కాదు.. వయ్యారి గణితం. లాస్ట్ లో ఒక వీడియో ఉంది. అందులో అదా తనలోని దబిడిదిబిడిని బయటకు తీసి ఓ హారర్ టచ్ ఇచ్చింది. ఏదేదో మాట్లాడింది. మహమ్మారితో కూడా ఏదో చర్చించింది.

త్వరగా షూటింగులు ప్రారంభమై అదా బిజీగా మారకపోతే ఈ గ్లామర్ + హారర్ ఎటాక్స్ డోస్ పెంచుకుంటూ పోయేలా ఉంది. ఇక అదా ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే 'మ్యాన్ టు మ్యాన్'.. 'బైపాస్ రోడ్' అనే చిత్రాల్లో నటిస్తోంది.
Tags:    

Similar News