నెపోటిజాన్ని ఇన్ సైడర్స్ ని వ్యతిరేకించే ఔట్ సైడర్స్ వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యష్ రాజ్ సంస్థ పరిచయం చేసిన యంగ్ హీరోయిన్ ఆదా శర్మ నెపోటిజమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తెలుగు లో ఓ మర్డర్ మిస్టరీ లో నటిస్తున్న అదా హైదరాబాద్ లోనే ఉంది. ఈ మూవీ వికారాబాద్ ఫారెస్ట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ ఓ జాతీయ మీడియా తో ముచ్చటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా పలు ఆసక్తిర విషయాల్ని ఆదా షేర్ చేసుకుంది. `నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అంతా నన్ను ఒకే ప్రశ్న అడుగుతున్నారు.. అదే బంధు ప్రీతి. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. నన్ను ప్రశ్నించిన ప్రతీ ఒక్కరూ నెపోటిజమ్ పై మీ మనసు లోని మాట చెప్పండి అని అడిగే వారు. దానికి నేను `మీలో టాలెంట్ వుంటే ఖచ్చితంగా మీరు పని లభిస్తుందని చెప్పేదాన్ని. కానీ మనసులో మాత్రం ఎంత టాలెంట్ వున్నా సరైన అవకాశం లభించనప్పుడు వారి ప్రతిభకు గుర్తింపు రాదు కదా ? అని నా మనసు నన్ను ప్రశ్నించేది.
అయినా పాజిటివ్ గా వుండటానికి.. అందరికి నవ్వులు పంచడానికే ప్రయత్నించాను. పాజిటివ్ గా వుండాలనే నిర్ణయించుకున్నాను. అవకాశాలు రాలేదా ఓకే లీవిట్ అనే ధోరణిలో ముందుకు సాగడం నేర్చుకున్నాను. ఏం జరుగుతుందో చూడాలని నిర్ణయించుకున్నాను. ఓ పిల్లోని క్యాట్ ఆకారంలో వుంచి దానికి ఇన్ స్టా అకౌంట్ ని క్రియేట్ చేశాను. వెరిఫైడ్ అకౌంట్ వచ్చింది. దానికి 60 వేల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. అది నిజమైన క్యాట్ అనుకుని దానికి మూడు ఎండోర్స్ మెంట్ డీల్స్ కూడా వచ్చాయి. ఒక స్టార్ గా నా వల్ల దానికి స్టార్ స్టేటస్ వచ్చింది. అలా అని నా స్టర్ డమ్ ని మార్చుకోవడానికి నా తల్లిదండ్రుల్ని మార్చలేను అని చమత్కరించింది అదా.
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆదా గత 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలని చూసింది. హిందీ- తెలుగు- తమిళ చిత్రాల్లో నటించింది. అయితే ఎన్ని ఇండస్ట్రీలు మార్చినా.. ఎంత ప్రయత్నించినా అదా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. దానికి కారణం తనకు ఆలియా లాగానో లేక సోనాక్షి.. సోనమ్ లానో సినీనేపథ్యం లేదు కాబట్టే. బ్యాకింగ్ చేసే బడా కుటుంబాలేవీ తనకు అండగా లేవు కాబట్టి. అయితే యష్ రాజ్ ఫిలింస్ లో పరిచయం కావడమే తనకు కొంతవరకూ ప్లస్ అయ్యింది అంతే! ఆ తర్వాత వాళ్లు కూడా ఆఫర్లు ఇవ్వకుండా లైట్ తీస్కున్నారు. దీనిపైనే అదాశర్మ అసహనం వెల్లగక్కిందా?