అలా పడుకుంటే 8 ప్యాక్ ఫ్రీగా వస్తుంది

Update: 2018-06-15 16:29 GMT
బాడీ ఫిట్ గా మెయింటెయిన్ చేయడం కోసం విపరీతంగా వర్కవుట్స్ చేయాల్సిందే. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా తమ అందాలను కూడా కాపాడుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. అయితే.. సిక్స్ ప్యాక్ అంటే ఇప్పుడు అందరికీ క్రేజ్. కానీ కొంతమంది మాత్రమే వీటిని చేసి చూపించగలిగారు.

కానీ ఓ హీరోయిన్ మాత్రం.. జస్ట్ పడుకునే సిక్స్ ప్యాక్ ఏంటి.. ఏకంగా 8ప్యాక్ కూడా చేయచ్చని చెబుతోంది. అందుకోసం ఎలా పడుకోవాలో కూడా చూపించింది కూడా. రీసెంట్ గా ఓ మేగజైన్ కోసం బ్యూటీ ఆదా శర్మ ఫోటో షూట్ చేసింది. ఇందులో భాగంగా తాను ఎలాంటి ఫిట్నెస్ సూత్రాలు పాటిస్తానో బాగానే వివరించింది. వీటితో పాటు తాను బికినీ బాడీ ఎలా సాధించానని చాలా మంది అడుగుతూ ఉంటారని.. ఇందుకు చక్కని మార్గం చెబుతానన్న ఆదా శర్మ.. ఓ చిన్నపాటి వీడియో ద్వారా ఆ సీక్రెట్ గుట్టు విప్పింది.

ఓ తాడు ద్వారా వేళ్లాడుతూ.. ఆ తాడును నడుముకు కట్టుకుని.. కాలికి మెలివేసి.. ఆ తాడుకే వేళ్లాడుతూ పడుకోవడం ఎలాగో చూపించింది ఆదా శర్మ. ఇలా చేస్తే ఎయిట్ ప్యాక్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటోంది ఆదా. కానీ ఇలా రోప్ తో బ్యాలెన్సింగ్ చేసేందుకు చాలా స్థైర్యం.. నిలకడ కావాలని చెప్పింది ఈ బ్యూటీ. అంతర్జాతీయ మల్లకుంభ దినం కావడంతో.. ఈ వీడియో పోస్ట్ చేసింది ఆదా శర్మ.

Full View
Tags:    

Similar News