నేటితరం హీరోలకు ఓటీటీలు అద్భుత వరాలుగా మారాయనే చెప్పాలి.యంగ్ హీరో తేజ సజ్జాకు ఇటీవల ఓటీటీ లో క్రేజీ ఆఫర్ దక్కింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న భారతదేశపు మొదటి ఒరిజినల్ సూపర్ హీరో హను-మ్యాన్ షూటింగ్ లో తేజ సజ్జా బిజీగా ఉన్నారు. ఇదేగాక అతడు నటిస్తున్నమరో చిత్రం `అద్భుతం` నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఇది ప్రత్యక్ష OTT విడుదలకు సిద్ధమవుతోంది. `అద్భుతం` ఓటీటీ -శాటిలైట్ హక్కుల కోసం భారీ ఆఫర్లను దక్కించుకుంది. అద్భుతం చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. రధన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
హాట్ స్టార్ ఈ సినిమా స్ట్రీమింగ్ - శాటిలైట్ హక్కుల కోసం 7 కోట్ల మేర చెల్లిస్తోందని సమాచారం. నిజానికి కరోనా వల్ల ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. అయినా ఇంత పెద్ద మొత్తం ఆఫర్ దక్కడం నిజంగా పాజిటివిటీని పెంచుతోంది. అలాగే హిందీ రైట్స్ సహా ఇతర భాషల డబ్బింగ్ హక్కుల వ్యాపారం త్వరలో పూర్తి కానుందని తెలిసింది.
తేజ సజ్జాకు బిగ్ బ్రేకిచ్చే మూవీ..!
తేజ సజ్జా వరుసగా సినిమాల్లో నటిస్తూ హీరోగా తన గ్రాఫ్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతడు హను-మాన్ అంటూ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ లో నటిస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది అతడి కెరీర్ కి కీలక మలుపునిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నారు. ఇది కేవలం ఒక సినిమా కాదు.. భారతీయ పురాణేతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో వరుస చిత్రాలను రూపొందిస్తున్నామని ముందే టైటిల్ ప్రకటనలోనే దర్శకుడు వెల్లడించారు.
అయితే సూర్య పుత్రుడు తేజోవంతుడైన హను-మాన్ గా జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా పేరును ప్రకటించగా రకరకాల సందిగ్ధతలు వ్యక్తమయ్యాయి. కానీ దానికి ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో తెరపై సమాధానమివ్వనున్నారట. సరికొత్త సినిమాటిక్ విశ్వం(అంటే కొన్ని సినిమాల సిరీస్) లోకి ప్రవేశించే ముందు సీట్ బెల్ట్ కట్టుకోండి!! అంటూ కాన్ఫిడెంట్ గా ప్రకటించిన ప్రశాంత్ వర్మ యువహీరోతో నమ్మకంగా ముందుకు సాగడం ఆశ్చర్యపరిచింది. తొలుత ఈ చిత్రంలో మెగా హీరో సాయి తేజ్ నటిస్తారని ప్రచారమైనా.. తేజ సజ్జాని ఫైనల్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకుముందు హనుమంతు పాత్రను పరిచయం చేయగా చక్కని స్పందన వచ్చింది. నిరవ్ రెడ్డి-చైతన్య నిరవ్ తదితరులు ఈ చిత్రంతో అసోసియేట్ అయ్యి పని చేస్తున్న సంగతి తెలిసిందే.