ప్రైవేట్ జెట్ లో దుబాయ్ వెళ్లిన అధీరా.. కార‌ణమిదే!

Update: 2020-11-01 07:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ మూడో ద‌శ‌ క్యాన్సర్ ‌తో తీవ్రంగా బాధపడుతున్నప్పుడు అతని భార్య మాన్యత స‌హా పిల్లలు దుబాయ్ లో ఉన్నారు. మహమ్మారి కారణంగా.., మాన్యత తమ పిల్లలను విడిచిపెట్టి  సంజ‌య్ తో కలిసి ఉండటానికి ఒంటరిగా ముంబైకి వ‌చ్చేశారు. అనంత‌రం సంజూ భాయ్ కి ప్ర‌యివేట్ కార్పొరెట్ ఆస్ప‌త్రిలో క్యాన్స‌ర్ చికిత్స కొన‌సాగింది.

తాను క్యాన్సర్ ను జ‌యించి కోలుకున్నానని ఇటీవల సంజయ్ వెల్లడించాడు. త్వ‌ర‌లో కేజీఎఫ్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఈ గ్యాప్ లో ఇప్పుడు ఆయ‌న ఓ ప్రైవేట్ జెట్ లో దుబాయ్ బయలుదేరాడు. బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ నిన్న ఇన్ స్టాగ్రామ్ లో ఆయన సంజయ్ కలిసి దుబాయ్ వెళ్తున్నప్ప‌టి కొన్ని ఫోటోల్ని పంచుకున్నారు. సంజయ్ ‘ధైర్యవంతుడు’ అని సోను ప్రశంస‌లు కురిపించారు.

కెరీర్ సంగ‌తి చూస్తే... సంజయ్ ద‌త్  ఈ నెలలో కెజిఎఫ్ చాప్టర్ 2 షూట్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. అతను మ‌రో రెండు పెద్ద  బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టించాల్సి ఉంది. త‌న పిల్ల‌ల్ని కలుసుకునేందుకు ఇలా ప్ర‌యివేట్ జెట్ లో సంజ‌య్ ద‌త్ దుబాయ్ వెళ్లార‌న్న‌మాట‌. ఇండియాతో పోలిస్తే క‌రోనా దుబాయ్ లోనే కంట్రోల్ లో ఉంద‌ని అంటున్నారు కాబ‌ట్టి అక్క‌డి నుంచి పిల్ల‌ల్ని తీసుకురారేమో!
Tags:    

Similar News