సౌత్ సినిమాలు ఇంతకుముందు లాగా సౌత్ కే పరిమితం అయిపోవట్లేదు. నార్త్ లో సైతం మన సినిమాలకు బాగానే మార్కెట్ పెరుగుతోంది. రోబో.. బాహుబలి లాంటి సినిమాలు అక్కడి ప్రేక్షకుల్ని బాగానే మెప్పించాయి. శంకర్.. రాజమౌళి లాంటి దర్శకుల తర్వాతి సినిమాలపై నార్త్ ఆడియన్స్ చాలా ఆసక్తితో ఉన్నారు. ‘బాహుబలి-2’ కోసం వేయి కళ్లతో ఎదురు చుూస్తూ.. రోబో-2 మీద కూడా ఓ కన్నేసి ఉంచారు. ఇందులో అక్షయ్ కుమార్ ను విలన్ గా ఎంచుకోవడం ద్వారా శంకర్ చాలా మంచి ఎత్తుగడే వేశాడు. ఆ ఒక్క ఇంక్లూజన్ చాలు.. రోబో-2 బాలీవుడ్ లో సైతం భారీ లెవెల్లో రిలీజవడానికి. హీరోయిన్ అమీ జాక్సన్ సైతం బాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే పరిచయం. ఇంకా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడికి కీలక పాత్ర ఇచ్చాడు శంకర్.
శ్రీదేవి రీఎంట్రీ మూవీ ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో ఆమె భర్తగా నటించిన అడిల్ హుస్సేన్ కూడా ‘రోబో-2’లో కీలక పాత్ర చేస్తున్నాడు. అతను విలన్ బృందంలో ఉండే సైంటిస్టు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రోబో-2 షూటింగ్ కి కొంచెం బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే తర్వాతి షెడ్యూల్ మొదలవబోతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. రెండు షెడ్యూళ్లలో 40 శాతం షూటింగ్ పూర్తి చేశాడు శంకర్. కబాలి-2 డబ్బింగ్.. ప్రమోషన్ కోసం రజినీ బ్రేక్ తీసుకున్నాడు. ఆయన మే నెలాఖర్లో మళ్లీ రోబో-2 కోసం మేకప్ వేసుకోనున్నారు. ఆ తర్వాత సినిమా పూర్తయ్యే వరకు ఇంకో పనేమీ పెట్టుకోరు. 2017 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాదే షూటింగ్ పూర్తి చేసినా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం కనీసం ఆరు నెలలైనా పడుతుందని సమాచారం.